నిరీక్షణ ముగిసినట్టే: అఙ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది, ఆడియో డేట్ ఇదే

పవన్ - త్రివిక్రమ్ ల కాంబోలో 'అజ్ఞాతవాసి' ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Recommended Video

అఙ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది.. ఆడియో డేట్ ఇదే

పవన్ - త్రివిక్రమ్ ల కాంబోలో 'అజ్ఞాతవాసి' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి.

 వారణాసిలో చివరి షెడ్యూల్

వారణాసిలో చివరి షెడ్యూల్

త్వరలో వారణాసిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ - అనిరుధ్ కంపోజ్ చేసిన `బయటికొచ్చి` చూస్తే లిరికల్ సాంగ్ - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ ...ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి.

 ఆడియోను రిలీజ్

ఆడియోను రిలీజ్

అయితే ఇప్పటివరకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటికి రాకపోవడమే కాకుండా పలుమార్లు వాయిదా పడడం అభిమానులను నిరుత్సాహపరిచింది. అయితే వారందరికీ డబుల్ ధమాకా ఇచ్చేందుకు 'అజ్ఞాతవాసి` చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఆ చిత్ర ఫస్ట్ లుక్ - ఆడియోను రిలీజ్ చేసి పవన్ అభిమానులను మెస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

 ఫస్టులుక్ రిలీజ్

ఫస్టులుక్ రిలీజ్

ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ కు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. ఇప్పటికే విడుదలైన "బయటికొచ్చి చూస్తే" పాటకు రికార్డు స్థాయిలో స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.

 జనవరి 10వ తేదీన విడుదల

జనవరి 10వ తేదీన విడుదల

దీంతో ఈ చిత్ర ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే జనవరి 9న సెకెండ్ షోతో ఆ సినిమా విడుదల కాబోతోందని టాక్ వస్తోంది.

 జనవరి 9 సెకండ్ షో

జనవరి 9 సెకండ్ షో

హైదరాబాద్ లో బెనిఫిట్ షో లకు అనుమతులు లభించడం కష్టమవుతోంది. దీంతో జనవరి 10 న మిడ్ నైట్ - ఎర్లీ మార్నింగ్ షోలకు బదులుగా జనవరి 9 సెకండ్ షో తోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. గతంలో బాహుబలి 2ను కూడా ఇలాగే విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X