twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్!: రాక.. రాక హిట్ వచ్చినా.. రాజశేఖర్‌కు ఎందుకిలా జరిగింది?

    |

    Recommended Video

    పాపం..రాక రాక హిట్ వచ్చినా.. రాజశేఖర్‌కు ఎందుకిలా ?

    బడ్జెట్ లెక్కలు బోల్తా కొట్టడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. కథ చెప్పేటప్పుడు చెప్పే బడ్జెట్ అంచనా వేరు.. తీరా సెట్స్ పైకి వెళ్లాక అయ్యే బడ్జెట్ వేరు. మొత్తంగా సినిమా పూర్తయ్యేటప్పటికీ నిర్మాతకు ఖర్చుల భారం తడిసిమోపడవుతుంది.

    సదరు హీరోకు అంత మార్కెట్ ఉంటే పెద్దగా బాధపడాల్సిందేమి లేదు కానీ.. మార్కెట్‌కు మించి ఖర్చు చేస్తే మాత్రం నిర్మాత తలపట్టుకోవడం ఖాయం. ఇలా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయిన సినిమాల్లో రాజశేఖర్ 'పీఎస్వీ గరుడవేగ' కూడా చేరిపోయినట్లే కనిపిస్తోంది.

     ఓపెనింగ్స్ బాగున్నా..:

    ఓపెనింగ్స్ బాగున్నా..:

    గతేడాది నవంబర్ 3న విడుదలైన 'పీఎస్వీ గరుడవేగ'కు అన్ని వర్గాల నుంచి మంచి టాక్ వచ్చింది. దీంతో చాన్నాళ్ల తర్వాత రాజశేఖర్ ఖాతాలో హిట్ సినిమా పడిందనుకున్నారు. దానికి తగ్గట్లే తొలిరోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ లాంగ్ రన్‌లో మాత్రం సినిమాకు ఆశించిన స్థాయి వసూళ్లు దక్కలేదు.

     ఇంకా 32శాతం..:

    ఇంకా 32శాతం..:

    సినిమా క్లోజింగ్ రిపోర్ట్స్ చూస్తే గరుడవేగ కలెక్షన్ల పరంగా ఫ్లాప్ అయినట్లే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటిదాకా కలెక్ట్ చేసినదాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఇంకా 32శాతం రికవరీ బాకీ పడిపోయిందట. అంటే 68శాతం రికవరీ మాత్రమే దక్కింది.

     కలెక్షన్స్..:

    కలెక్షన్స్..:

    ఇక సినిమా రైట్స్ అమ్మకం ద్వారా రూ.11కోట్లు, షేర్స్ ద్వారా రూ.7.5కోట్ల వరకు గరుడవేగ రాబట్టిందట. అయితే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు లాంటి ఏరియాల్లో కనీసం 50లక్షల షేర్ కూడా రాబట్టలేదట.

     రెగ్యులర్ ఆడియెన్స్‌కు ఎక్కలేదా?:

    రెగ్యులర్ ఆడియెన్స్‌కు ఎక్కలేదా?:

    సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కే ఎక్కువ కనెక్ట్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బి,సీ సెంటర్లలో రెగ్యులర్ మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమాపై అంతగా ఆసక్తి కనబరచలేదని అంటున్నారు.

     రాక రాక హిట్ వస్తే..:

    రాక రాక హిట్ వస్తే..:

    రాజశేఖర్ సినిమాలకు అంతగా మార్కెట్ లేకపోవడం.. అయినా సరే రూ.25కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడమే సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌కు కారణం.

    కాస్త తక్కువ బడ్జెట్‌లో గనుక ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే మంచి లాభాలను సొంతం చేసుకుని ఉండేదంటున్నారు. మొత్తానికి రాజశేఖర్ కెరీర్ లో రాక రాక ఒక్క హిట్ వస్తే.. అది కూడా ఆయన్ను ఇలా నిరాశపరచడం గమనార్హం.

     టర్నింగ్ పాయింట్..:

    టర్నింగ్ పాయింట్..:

    కలెక్షన్ల సంగతెలా ఉన్నప్పటికీ.. ఈ సినిమాతో రాజశేఖర్ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడన్నది మాత్రం ఖాయం. చాన్నాళ్లుగా హిట్ లేక ఢీలా పడ్డ ఆయనకు గరుడవేగ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అటు ఆడియెన్స్ కు కూడా రాజశేఖర్ సినిమాలపై మళ్లీ ఒకింత క్యురియాసిటీ పెరిగేలా చేసింది. కాబట్టి రాజశేఖర్ తదుపరి సినిమాలైనా కలెక్షన్ల పరంగా హిట్ సాధిస్తాయేమో చూడాలి.

    English summary
    The PSV Garuda Vega final collections dissapointed rajasekhar, opening collections are also very good but Due to the budget involved i.e 30 crores, atlast the film become a costly failure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X