For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిఎస్‌వి గ‌రుడ‌వేగ కలెక్షన్స్ అదుర్స్, కోట్లు కురిపిస్తోంది

    By Bojja Kumar
    |
    "PSV Garuda Vega" 5 Days Collections కోట్లు కురిపిస్తుంది

    ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన డా.రాజ‌శేఖ‌ర్ ఎన్.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం. ఎల్‌బిడబ్ల్యు, చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్ర‌వీణ్ స‌త్తారు రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

    బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం సూపర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ చిత్రం రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఖరారు చేస్తూ నిర్మాత కోటేశ్వర్ రాజు ప్రకటన చేశారు.

     రీమేక్ రైట్స్ రూపంలో భారీ లాభం

    రీమేక్ రైట్స్ రూపంలో భారీ లాభం

    మరో వైప గరుడ వేగ రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట. తమిళ రీమేక్ రైట్స్ ను ఓ సంస్థకి భారీ రేటుకు ఇచ్చేందుకు రాజశేఖర్ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ స్థాయిలో డిమాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. దీని వల్ల సినిమాకు అదనపు లాభాలు వస్తాయని అంటున్నారు.

     రెండో వారం

    రెండో వారం

    ఈ చిత్రాన్ని జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బేన‌ర్‌పై ఎం.కోటేశ్వ‌ర్ రాజు నిర్మించారు. నవంబ‌ర్ 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌ని తెచ్చుకుంది. అంతేకాకుండా స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతూ.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ రెండో వారంలో సినిమా రెస్పాన్స్ బావుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

     నిర్మాత ఎం.కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ

    నిర్మాత ఎం.కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ

    నిర్మాత మాట్లాడుతూ.... "మా సినిమా ఐదు రోజుల్లో రూ.15 కోట్ల‌కిపైగా వ‌సూలే చేసింది. రెండో వారంలోకి అడుగుపెడుతున్న‌ప్ప‌టికీ ఆద‌ర‌ణ అంత‌కు అంత‌గా పెరుగుతోంది. రెండో వారంలో కూడా థియేట‌ర్ల సంఖ్య పెర‌గ‌డ‌మే సినిమాకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు సాక్ష్యం. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ థాంక్స్" అన్నారు.

     హ్యాపీగా ఉంది

    హ్యాపీగా ఉంది

    నేను నిర్మాత‌గా చేసిన తొలి సినిమా `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` సెన్సేష‌న‌ల్ హిట్ అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. రాజ‌శేఖ‌ర్ గారి అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్‌, ప్ర‌వీణ్ స‌త్తారు గారి ఎక్స్ ట్రార్డ‌న‌రీ టేకింగ్, సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల స‌హ‌కారం సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయని నిర్మాత కోటేశ్వర రాజు తెలిపారు.

    English summary
    PSV Garuda Vega 123.18M', released on Nov 3, has entered its second week of run with a thunder. Starring Dr. Rajasekhar, Adith Arun, Pooja Kumar and others, the action-thriller has been directed by the versatile Praveen Sattaru, and produced by Jyostar Enterprises. Producer M Koteswar Raju says, "This is my first film as a producer. I am glad that my debut has turned out to be a sensational hit. Ever since the teaser was released, expectations from the film hit a peak. Thanks to Dr. Rajasekhar garu's excellent performance, Praveen Sattaru's extraordinary narration and taking, superb technical elements and the efforts of others, our film has made Rs. 15 Cr in 5 days. Day by day, the response has been growing phenomenally."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X