Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిపోతోంది.... ఖైదీ నెం 150 పై అభిమానుల స్పందన
రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు చిరు సినిమా విడుదలైన ప్రతీ థియేటర్ వద్దా అభిమానుల సందడితో వాతావరణం ఉల్లాసంగా కేరింతలతో హోరెత్తిపోతోంది.
బాస్ ఈజ్ బ్యాక్ అనే అరుపులూ, కేరింతలూ పదేళ్ళ తర్వాత అన్నయ్యని స్క్రీన్ మీద చూసుకున్న ఆనందం.... ఎట్టకేలకు మెగస్టార్ ముందు కాలం, మార్పులూ, కొత్త పోకడలూ, జనరేషన్ గ్యాప్ లూ ఏవీ పనికి రావని తేలిపోయాయ్..... సినిమా సూపర్ హిట్ అని తేలిపోయింది నటుడు శ్రీకాంత్, దర్శకుడు మారుతీ, మిగతా హీరోలూ...
అన్నయ్యని చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు కూడా కేవలం చిరంజీవి ఫ్యాన్స్ గా కనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు చిరు సినిమా విడుదలైన ప్రతీ థియేటర్ వద్దా అభిమానుల సందడితో వాతావరణం ఉల్లాసంగా కేరింతలతో హోరెత్తిపోతోంది. "పదేళ్ళ విరామం తర్వాత వచ్చినా తన స్టామినా ఏమిటో మళ్ళీ ఒక సారి నిరూపించుకున్నాడు అన్నయ్య" అంటూ.
ప్రతీ అభిమానీ మీడియా కెమెరాల ముందు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. మొత్తానికి నిన్నటి వరకూ ఉన్న ఒక ఉత్కంఠ కి తెరపడింది. ఏలా ఉండబోతోందో అన్న సినిమా తమ ఊహలకు మించి ఉందనీ ఇలా మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ మళ్ళీ అడుగు పెట్టటం తమకు పూర్తి సంతోషాన్నిచ్చింది అంటూ చెప్తూన్న అభిమానులకి ఇప్పుడప్పుడే ఈ ఆనందం పూర్తయ్యేలా లేదు. అన్నయ్యగా పిలుచుకునే చిరు తన సత్తా ఏమిటో మళ్ళీ ఒక సారి చూపించేసినట్టే.