For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ దూకుడు పబ్లిక్ టాక్ ఏంటీ..?

  By Nageswara Rao
  |

  ఎన్నో అంచనాలతో బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టేందుకు సూపర్ స్ట్రార్ ప్రిన్స్ మహేష్ 'దూకుడు' అంగరంగ వైభవంగా సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా 1200 ధియేటర్లలలో, 50, 400 ప్రింట్లతో విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు నుండే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో తెలుగు సినిమా చరిత్రలో మగధీర రికార్డులను బద్దలు చేస్తుందని మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతుంది.

  దూకుడు సినిమా యావత్ ప్రిన్స్ మహేష్ అభిమానులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల గుండెని దోచుకుంటుందని దూకుడు సినిమా బెనిఫిట్ షోకి వెళ్లిన మా ప్రతినిధి ఫోన్ ద్వారా తన అభిప్రాయాలను తెలపడం జరిగింది. అతను అందించిన సమాచారం మేరకు దూకుడు సినిమా ఫస్టాఫ్ సమాచారం మీకు అందివ్వడం జరుగుతుంది.

  దూకుడు సినిమా ఫస్టాఫ్:

  దూకుడు సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనువైట్ల కామెడీ మార్కుకి ఎటువంటి దెబ్బ తగలకుండా, అదే విధంగా మహేష్ అభిమానులకు ఏమేమి అంశాలు పుష్కలంగా కావాలో అన్ని అంశాలను ఫస్టాఫ్‌లో రంగరించడం జరిగిందని తెలిపాడు. మహేష్ బాబుని దూకుడు సినిమాలో చూపించిన విధానం కానీ, టెక్నికల్ వ్యాల్యూస్ ఫస్టాఫ్‌లో అదిరిపోయాయని తెలిపాడు. ఫస్టాఫ్‌లో హీరో పరిచయం సినిమాకే హైలెట్‌గా నిలస్తుందని అంటున్నారు.

  మహేష్ అందగాడే, అయినప్పటికీ స్క్రీన్ మీద మహేష్ అందం చింపేసిందని, అభిమానులు ఆనందానికి ధియేటర్లలలో అవధులు లేకుండా పోతున్నాయని కేరింతలు కొడుతున్నారని మా ప్రతినిధి తెలిపాడు. ఫస్టాఫ్‌లో ప్రిన్స్ మహేష్ బాడీ లాంగ్వేజీ గానీ, డైలాగ్ డెలివరీ గానీ అదుర్స్ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ చెప్పే ఒక్కో డైలాగ్‌కి సినిమా హాలులో గాలిలోకి ఎగిరే పేపర్లు, బెలూన్లు అచ్చం ఓ పండగ వాతావరణంలా ఉందని అన్నాడు. ఇంటర్‌వెల్ వరకు సినిమా చాలా ఉత్కంఠగా ఉందని, 70 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రని 'పోకిరి' బాక్సీ ఫీసు రికార్డుల్ని తలక్రిందులు సూపర్ స్టార్ దూకుడు సినిమా ద్వారా మరోసారి తన సత్తా చాటనున్నాడని అభిమానలు సినిమా హాలులో గుస గుసలాడుకుంటున్నారని అన్నాడు.

  ఇక ఈ సినిమా మొదటి భాగంలో రామ్ చరణ్, బాలకృష్ణ మీద వచ్చేటటువంటి ఇమిటేషన్ కూడా ధియేటర్లలలో ఉన్న ప్రేక్షకులలో కొత్త ఉత్సాహా్న్ని తెస్తుందని మా ప్రతినిధి ఫోన్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇంకా సెకండాఫ్ మొదలవలేదు. ఇక సెకండాఫ్‌లో పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి ప్రస్తావన, ఆయన ప్రసంగం వినిపించడం ప్రేక్షకుల్లో మరింత కేరింతలు కొట్టిస్తుందని సమాచారం. దూకుడు సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ రివ్వూ వన్ ఇండియా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది.

  దూకుడు సినిమా డైలాగ్ హైలెట్స్:

  1. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతాను .

  2. భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది

  3. ఒక్కొక్కడి బల్బులు పగిలి పోవాలి

  4.కళ్లు ఉన్నోడు ముందే చూస్తాడు...కానీ దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు...

  5. ఈ దూకుడే లేకపోతే పోలీస్ మెన్ కీ పోస్ట్ మెన్ కి తేడా ఏముంటుంది.

  6. నేను నరకడం మొదలుపెడితే నరకంలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టుకోవాలి రా..

  7. మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని

  గమనిక: 'దూకుడు' సినిమాని పైరసీ సిడిలలో చూడోద్దు.

  English summary
  South Prince Mahesh Babu's much awaited flick, Dookudu, hit the silver screens across the globe on this Friday. Director Srinu Vytla's film Dookudu stars dashing actor Mahesh Babu in the lead role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X