Just In
- 55 min ago
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- 1 hr ago
జై బాలయ్య అనే వరకు వదల్లేదు.. బోయపాటిని విసిగించిన నందమూరి ఫ్యాన్స్
- 2 hrs ago
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
- 3 hrs ago
పెళ్లికి సిద్ధమైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. వచ్చే ఏడాది ప్రేమించిన అమ్మాయితో వివాహం.!
Don't Miss!
- News
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Sports
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Technology
గూగుల్ ఇంటర్ప్రెటర్ ఇప్పుడు మొబైల్‌లోకి వచ్చేసింది
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఎన్టీఆర్, నాని, నాగార్జున.. ఇంతకీ అసలైన బిగ్‌బాస్ ఎవరు? జనం టాక్ ఎలా ఉందంటే..
బిగ్ బాస్.. బుల్లితెర భారీ పాపులారిటీ షోగా పేరొంది ఆడియన్స్ మనసు దోచేస్తోంది. పలు భాషల్లో మొదలైన ఈ షో సదరు టీవీ చానళ్లకు మంచి టీఆర్పీ రేటింగ్ తెచ్చిపెడుతోంది. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికొస్తే.. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని మూడో సీజన్ ముగింపుకు కూడా సిద్ధమైంది. దీంతో ఈ మూడు సీజన్లలో బెస్ట్ హోస్ట్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఆ వివరాలు చూద్దామా..

ముచ్చటగా మూడు సీజన్లు.. సందడే సందడి
బుల్లితెర ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ పరిచయం చేసింది బిగ్ బాస్ షో. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో చిన్ని తెరలపై తెగ సందడి చేస్తోంది. హిందీలో సల్మాన్, తమిళంలో కమల్ హాసన్ వరుస సీజన్లకు 'బిగ్ బాస్' హోస్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ తెలుగు మాత్రం ముచ్చటగా మూడో హోస్ట్ రంగంలోకి దిగడం గమనించాం.

ఎన్టీఆర్, నాని, నాగార్జున.. ఇక్కడే మొదలైంది చర్చ
తెలుగు బిగ్ బాస్ హోస్ట్ ఏటా మారుతూ వస్తుండటం పలు చర్చలకు దారి తీస్తోంది. 'బిగ్ బాస్ 1' హోస్ట్‌గా ఎన్టీఆర్ అదరగోటేశాడు. ఆ తరువాత బిగ్ బాస్ 2 బాధ్యతలకు భుజాన వేసుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇక మూడో సీజన్ వచ్చేసరికి ఏకంగా సీనియర్ హీరో నాగార్జున రంగంలోకి దిగారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనే దానిపై చర్చలు ముదిరాయి.

ఎన్టీఆర్ చేసిన మ్యాజిక్.. ఆయనొక్కరే..
ఇప్పటి దాకా బిగ్ బాస్ అనిపించుకున్న ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరు బెస్ట్? అంటే చాలా మంది ఎన్టీఆరే సూపర్బ్ అంటున్నారు. నాని, నాగార్జున 'బిగ్ బాస్'లుగా తమకు సాధ్యమైనంత ఎంటర్టైన్ చేసినప్పటికీ ఎన్టీఆర్ చేసిన మ్యాజిక్ తర్వాతి రెండు సీజన్స్‌లో కనిపించలేదని అంటున్నారు. పైగా ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా బిగ్ బాస్ హ్యాండిల్ చేసింది కేవలం ఎన్టీఆర్ మాత్రమే అంటున్నారు జనం.

నాగార్జున సైతం ఎన్టీఆర్‌లా.. జనాల్లో టాక్
'బిగ్ బాస్ 2' హోస్ట్‌గా చేసిన నాచురల్ స్టార్ నాని.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ పట్ల పక్షపాతం చూపాడని అప్పట్లో ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే. ఇక మూడో సీజన్ హోస్ట్ చేసిన నాగార్జున కూడా విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. పైగా బిగ్ బాస్ గా నాగార్జున సైతం ఎన్టీఆర్‌లా ఆకట్టుకోలేక పోయాడనే టాక్ జనాల్లో వినిపిస్తోంది.

అప్పుడే మరో హోస్ట్‌పై ఊహాగానాలు
ఇక బిగ్ బాస్ సీజన్ 3 ముగింపుకు ముహూర్తం కుదరడంతో నెక్స్ట్ సీజన్ హోస్ట్ ఎవరనే దానిపై కూడా చర్చలు మొదలయ్యాయి. ఈ సారి బిగ్ బాస్ 4 హోస్ట్ బాధ్యతలు చిరంజీవికి అప్పజెబితే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్.