గబ్బర్ సింగ్‌పై పబ్లిక్ వాయిస్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దాదాపు 10 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ ఫాలోయింగ్‌కు తగిన విధంగా ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా చాలా చాలా బాగుందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఇలా ఉంది.
రమేష్, ఇంజనీరింగ్ స్టూడెంట్:
సినిమా చాలా బాగుంది. పవర్ స్టార్ యాక్టింగ్ చించేశాడు. గబ్బర్ సింగ్ ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు.
వాసు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్:
పవర్ స్టార్ కెరీర్లోనే సినిమా బిగ్గెస్ట్ హిట్. కెవ్వుకేక పాటతో పాటు అన్ని సాంగులు అదిరి పోయాయి. పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ వేసవి విన్నర్ గబ్బర్ సింగే. ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.
బద్రినాథ్, అకౌంటెంట్:
పవన్ కళ్యాణ్ గతంలో ఏ సినిమానూ చేయని విధంగా డాన్స్‌ను ఇరగ దీశారు. ఫైట్స్ బాగున్నాయి. పంచ్ డైలాగులు అదరి పోయాయి. బ్రహ్మానందం, అలీ తదితరుల కామెడీ ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత ఒక సంతృప్తికరమైన సినిమా పవర్ స్టార్ నుంచి వచ్చింది.
నిఖిలేష్, దిల్‌సుఖ్‌నగర్:
తెలుగు సినిమా రికార్డులన్నీ గబ్బర్ సింగ్ బద్దలు కొట్టడం ఖాయం. చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ప్రేక్షకుల వరకు అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ కింగ్ పవర్ కళ్యాణే.
విక్రమ్, ఎంసీఏ స్టూడెంట్
సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్మెంట్. సినిమా చూస్తున్నంతసేపు మంచి వినోదాత్మక సినిమా చూసిన అనుభూతిని పొందుతారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. పవర్ స్టార్ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. బద్రి, ఖుషి, జల్సా తర్వాత గబ్బర్ సింగ్ పవర్ స్టార్ కెరీర్లో ఓ మైలురాయి.


Click it and Unblock the Notifications











