twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇకలేరు.. విషాదంలో సినీ పరిశ్రమ.. బాలకృష్ణ సంతాపం..

    |

    తెలుగు సినిమా పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఐదు దశాబ్దాలకుపైగా సినిమా పరిశ్రమకు పబ్లిసిటీ డిజైన్ రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన ఈశ్వర్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వార్త తెలిసిన పలువరు సినీ ప్రముఖులు, నటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు విడుదల చేశారు. ఆయన మరణానికి సంబంధించి, అలాగే వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

    చెన్నైలో కన్నుమూసిన ఈశ్వర్

    చెన్నైలో కన్నుమూసిన ఈశ్వర్

    సీనియర్ పబ్లిసిటీ డిజైనర్‌గా సుపరిచితులైన ఈశ్వర్‌ అసలు పేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వస్థలం. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో పరమపదించారు అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

    బాపు చిత్రం సాక్షితో సినీ రంగంలోకి

    బాపు చిత్రం సాక్షితో సినీ రంగంలోకి

    బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు.

    ప్రముఖ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్‌గా

    ప్రముఖ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్‌గా

    విజయ, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. 'దేవుళ్ళు' ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ గారి సహకారంతోనే ఆయన సోదరులు బ్రహ్మం అనూ గ్రాఫిక్స్ కోసం తెలుగు ఫాంట్‌లను రూపొందించారు.

    రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో

    ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది.

    ఆయన మృతికి నిర్మాత సురేష్ బాబు, తెలుగు సినీ పబ్లిసిీ డిజైనర్ అసోసియేషన్, ఆయన స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈశ్వర్ గారి మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను అని సురేష్ బాబు సంతాపం సందేశంలో పేర్కొన్నారు.

    Recommended Video

    Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
    నందమూరి బాలకృష్ణ సంతాపం

    నందమూరి బాలకృష్ణ సంతాపం

    పలు చిత్రాలకు తన డిజైన్స్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు.‌ ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా తాను కథానాయకుడిగా నటించిన కొన్ని చిత్రాలకు ఈశ్వర్ పని చేశారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

    English summary
    Publicity Designer Eshwar dies at 85. Actor Balakrishna, Producer SBDaggubati expressed his grief about the passing away of Senior Publicity Designer Shri #Eeshwar garu.SureshProdns
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X