పవన్ కు ఎఆర్ రెహమాన్ బర్తడేగిఫ్ట్

By Staff

ఫంక్షన్ల కి వీలైనంత దూరంలో వుండే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ సారి తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకోనున్నారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోర పరాజయం తర్వాత డిప్రెషన్ లో వున్న పవన్ తన పుట్టిన రోజును ఎలా జరుపుకోనున్నారా అన్న సంధిక్తతకు తెరదించుతూ ఈ ప్రకటన వెలువడింది.

ఇంతకీ విషయమేమిటంటే పవన్ కళ్యాన్ నటిస్తున్న కొమరం పులి చిత్రం ఆడియో పవన్ పుట్టిన రోజున (సెపెంబర్ 2) విడుదల చెయ్యబోతున్నారు. అభిమానుల సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరగబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఖుషి చిత్రం తర్వాత యస్.జె.సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీగా అంచనాలు ఉన్నాయి.

షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ రామానాయుడు స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా నిఖిష పటేల్ అనే లండన్ అమ్మాయి కథానాయికగా పరిచయమౌతోంది. ఇక ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టేలా అతని క్యారెక్టర్ ఉండబోతోందని సమాచారం.

మొన్న ఎన్నికల్లో అవినీతి గురించి ప్రజల్లోకి వెళ్లడం లో విఫలమైన పవన్ సినిమా లో అయినా ఆకట్టుకుంటారో లేదో చూడాలి.....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X