ఈ జన్మకు ‘కొమరం పులి’ ని తీసానన్న సంతృప్తి చాలు...!?
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'కొమరం పులి" విడుదల కోసం పవన్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా బెనిఫిట్ షోలు అన్ని ఏరియాల్లో ప్రదర్శించడానికి ఏర్సాటు జరుగుతున్నాయట. ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోటు ప్రదర్శించబడతాయని తెలుస్తోంది. కాగా ఈ షోల ద్వారా దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ అంచనాలు కరెక్ట్ అయితే బెనిఫిట్ షోలకు హయ్యస్ట్ కలెక్ట్ చేసిన సినిమా ఇదే అవుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
కాగా ఖుషి చిత్రంతో పవన్ కళ్యణ్ కి తిరుగులేని హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య..మళ్లీ పవన్ తో తిరుగులేని సినిమా చేశానని చెప్పుకుంటూ..అది చాలు..జన్మలో ఏం చేశావ్ అని అడిగితే?కొమరం పులి చిత్రాన్ని రూపొందించాను..అని గర్వంగా చెప్పుకుంటాను..ఆ చిత్రం తర్వాత ఏ చిత్రం చేసినా..అది నాకు సంతృప్తి నివ్వదు..అని చెప్పుకుంటున్నాడు. అలాగే ఇకపై దర్శకునిగా రిటర్మైంట్ తీసుకుంటున్నానని కూడా చెప్పేశాడు..పవన్ కళ్యాణ్ తో చేసిన 'కొమరం పులి" చిత్రం విడుదల అయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మీరే అంటారు..ఎందుకంటే పులి చిత్రం అంతలా నన్ను కదిలించేసింది..చివరి చిత్రం పవన్ కళ్యాణ్ తో..ఇంత గొప్ప చిత్రం చేసినందుకు చాలా గర్వంగా ఉందని..సూర్య తెలుపుతున్నాడు.
ఇకపై ఎటువంటి చిత్రానికి దర్శకత్వం చేయనని ఒకవేళ పవన్ కళ్యాణ్ తో మరో చిత్రానికి పనిచేయాల్సి వస్తే ఆ చిత్రానికి కథను మాత్రమే అందిస్తాను తప్ప దర్శకత్వం మాత్రం చేయనని..ఆ కథని వేరే దర్శకునితో చేయించుకోమని చెబుతాను..అని కూడా సూర్య అంటున్నాడట..మరి అంతటా సూర్యను కదిలించడానికి 'పులి" లో ఏముందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..


Click it and Unblock the Notifications











