సినిమా ఎలా ఉన్నా 'పులి' హీరోయిన్ కి ఆ పిచ్చి పట్టింది
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులి మొన్న శుక్రవారం రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాక్ పూర్తి స్ధాయిలో స్ప్రెడ్ అయ్యే లోగా కలెక్షన్స్ లాగేయ్యాలనేమో మరెందుకో గానీ విపరీతమైన పబ్లిసిటీ ప్రారంబించారు. అందులో భాగంగా హీరోయిన్ నిఖిషా పటేల్ అన్ని ఛానెల్స్ లోనూ కంటిన్యూగా ఇంటర్వూలు ఇస్తోంది. ఆ ఇంటర్వూలో ఆమెను ఓ టీవీ ఛానెల్ వారు మీ లక్ష్యం ఏమిటీ అంటే మా దర్సకడు ఎస్.జె.సూర్య ..డైరక్టర్ గా ఇదే చివరి చిత్రమని చెప్పారు. ఆయన ఇక పూర్తి కాన్సర్టేషన్..నటనపై పెడతానన్నారు. అయితే తాను రివర్స్ గా ఏదో రోజు డైరక్టర్ గా తనను తాను చూసుకోవాలని ఉందని చెప్పింది. సూర్యా నే ఆమెకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. అలాగే తనకు హీరోల్లో హృతిక్ రోషన్ అంటే విపరీతమైన ఇష్టం అనీ, హీరోయిన్స్ లో మాధురీ దీక్షిత్ కే తన ఓటు అంది. ఇక తనకు పులి చిత్రంలోని మహమ్మరి మాయే అనే పాట చాలా ఇష్టం అని అంది. అలాగే పవన్ గురించి చెబుతూ..ఆయన చాలా సింపుల్ గా, డౌన్ టు ఎర్త్ పర్శన్ లా ఉంటారని, అతని యాక్షన్ సీక్వెన్స్ లు తనకు బాగా నచ్చాయని అంది. ఇక ఆమె దర్సకత్వం ఆలోచన ఏ నిర్మాతకన్నా నచ్చితే ఆమెను తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











