3 రోజలకే రికార్డులు సృష్టించిన ‘కొమరం పులి’ సాంగ్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి" చిత్రం ఆడియో జూలై 12న విడుదలైన విషయం మీకు తెలిసిందే. ఎఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో హక్కులను సోనీ బి.ఎమ్.జి. సంస్థ వారు సొంతం చేసుకొని మార్కెట్లోకి విడుదల చేశారు. ఆగస్టులో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం పాటలు విడుదలైన మూడు రోజులకే 7.6 లక్షల సిడిలు అమ్ముడయ్యాయి. సోనీ బి.ఎమ్.జి. సంస్థ వారు తొలి విడతగా విడుదల చేసిన 7.6 సిడిలు మొత్తం అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఇదే హయ్యస్ట్ రికార్డ్. ఇక విడుదలకు ముందే 14 లక్షల సిడిలు సేల్ చెయ్యాలన్నదే సోనీ సంస్థవారి టార్గెట్. ఆడియో పరంగా కొత్త రికార్డులుసృస్తున్న 'కొమరం పులి" సినిమా విడుదల అయిన తర్వాత ఎలాంటి రికార్డుల ను నెలకొల్పనుందో వేచి చూడాల్సిందే. శ్రీ కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ద్వారా నికిషా పటేల్ హీరోయిన్‌గా పరిచయమవుతుంది.


Click it and Unblock the Notifications











