మహేష్ నిర్మాతకు కొత్త టెన్షన్?

దాంతో రమేష్ క్యాంప్ లో ఇదో చర్చనీయాంశంగా మారిందంటున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ రెండు సినిమాలు అనుకున్న బడ్జెట్ పెరగకుండా ఉండి సూపర్ హిట్టయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దానికి ఉదాహరణగా గతంలో త్రివిక్రమ్ ...మహేష్ తో మురళీ మోహన్ కి చేసిన అతడు సినిమాను ఉదాహరణగా చూపెడుతున్నారు. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎక్కువకావటంతో అంత స్ధాయిలో హిట్టయినా పెట్టుబడి మాత్రమే వచ్చిందని అప్పటినుంచీ ఆయన సినిమా చేయలేదని చెప్తున్నారు. అటువంటి పరిస్ధితిని రమేష్ కి ఎదురుకాకూడదని కోరుకుందాం.ఎందుకంటే టేస్ట్ ఉన్న నిర్మాతలు మిగిలితేనే కదా మంచి సినిమాలు వచ్చేది అంటున్నారు.


Click it and Unblock the Notifications











