శ్రీదేవికి అతీత శక్తులు? ‘పులి’ అపీషియల్ ట్రైలర్-2
హైదరాబాద్: తమిళ స్టార్ విజయ్ హీరోగా చింబుదేవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పులి'. హన్సిక, శృతి హాసన్ హీరోయిన్లు. ఈ చిత్రంలో మహారాణిగా ప్రముఖ నటి శ్రీదేవి ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలే ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. యూట్యూబులో ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ‘పులి' చిత్రానికి సంబంధించిన సెకండ్ అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే శ్రీదేవి ఈ చిత్రంలో అతీత శక్తులున్న వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రం కథని శింబు దేవన్ రాసారు. పులి చిత్రం యాక్షన్ ఎడ్వెంచర్ ఫాంటసీ గా సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారు. ఈ కథ పురాతన కాలంలోనూ, ఇప్పటి మోడ్రన్ ప్రపంచంలోనూ జరుగుతుంది. పిల్లలను, పెద్దలను, అభిమానులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.
కన్నడ స్టార్ సుదీప్, ప్రభు, తంబి రామయ్య, సత్యన్, జూనియర్ బాలయ్య, నరేన్, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











