రభాస్ హీరోగా ‘పులి రాజా ఐపీఎస్’(ఫోటోస్)
హైదరాబాద్: వైట్ లోటస్ సినీ క్రియేషన్స్ పతాకంపై రాఘవ తిరువాయిపాటి దర్శకత్వంలో గుణ్ణం జె.రావు నిర్మించనున్న చిత్రం 'పులిరాజా ఐపీఎస్'. రభాస్ (పొట్టి రాంబాబు) హీరోగా రూపొందనున్న ఈచిత్రం పూజా కార్యక్రమాలు ఈ రోజు సంస్థ కార్యాలయంలో జరిగాయి. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'వన్ అండ్ ఓన్లీ స్టార్ రభాస్ (పొట్టి రాంబాబు) హీరోగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేసాం. ఇందుకోసం కొంత మంది నూతన నటీనటులు కూడా నటించనున్నారు' అని చెప్పారు.
స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

పులి రాజా ఐపీఎస్
రభాస్ (పొట్టి రాంబాబు) హీరోగా ‘పులిరాజా ఐపీఎస్' చిత్రం తెరకెక్కుతోంది.

స్టోరీ ఏంటంటే...
దర్శకుడు మాట్లాడుతూ...‘మూడున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండే హీరో పోలీసాఫీసర్ కావాలనే తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది ఈ చిత్రం కథాంశమని తెలిపారు.

సిక్స్ ప్యాక్
ఈ పాత్రను పొట్టి రాంబాబు చేయనున్నారు. ఇందులో ఆయన సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు యూ ట్యూబులో హల్ చల్ చేస్తున్నాయి' అని చెప్పారు.

ఇతర వివరాలు
ఈ చిత్రానికి సహ నిర్మాత: కె.మాధవ్, పి.ఆర్.ఓ: శివ మల్లాల, మాటలు: వెంకట్, శివ, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: రాఘవ తిరువాయిపాటి.


Click it and Unblock the Notifications