Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ‘పులి’ సక్సెస్ సంబరాలు ఒకేసారి..
అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు కొమరం పులి విడుదల తేది వాయిదా పడుతూ వస్తోంది. 'కొమరం పులి"గా పవర్ స్టార్ రాకకు రంగం సిద్దమయింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కధానాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినమైన సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఇటు పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ నీ..అటు 'కొమరం పులి" సక్సెస్ సంబరాలనీ ఒకేసారి జరుపుకొనే అవకాశం దక్కింది అభిమానులకి.
అన్నట్టు పవన్ కళ్యాణ్ చిత్రాల్లోకెల్లా ఇదే మోస్ట్ ఫవర్ ఫుల్ ఫిల్మ్ అనీ, 'పులి"గా పవర్ స్టార్ పలికిన డైలాగ్స్ ప్రభంజనం సృష్టిస్తాయని ఇండస్ట్రీలో చాలా పెద్ద రిపోర్ట్ వినిపిస్తోంది. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన స్వరాలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. అలాగే బాక్సీఫీస్ లో 'కొమరం పులి" సృష్టించే కొత్త రికార్డులపై కూడా అంతటా ఎక్స్ పెక్టేషన్ పెరిగిపోతోంది..అందరిలోనూ ఎక్సైట్ మెంట్ ఉరకలేస్తోంది. మరైతే ఈ తేదీకైనా కొమరం పులి విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి.