పవన్ కళ్యాణ్ 'కొమురం పులి' రిలీజ్ డేట్ ఛేంజ్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కొమురం పులి' చిత్రం సెప్టెంబర్ తొమ్మిదిన న రిలీజ్ చేస్తామని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డేట్ సెప్టెంబర్ 10వ తేదీకి మారినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ ఫైనాన్సియర్ శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. నిఖిషా పటేల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మనోజ్ బాజపేయి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరిగే ఈ కథలో నాజర్, చరణ్ రాజ్, గిరీష్ కర్నాడ్ కీలకపాత్రలు చేస్తున్నారు. వినోద్ ప్రధాన్ కెమెరా అందిస్తూంటే ఖుషీ ఫేమ్ ఎస్ జె సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రీసెంట్ గా పవన్ హీరోగా జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ ప్రారంభమైంది. బొత్సా సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాస్యనటుడు గణేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రానికి ఎ సర్టిఫికేట్ సెన్సార్ వారు ఇష్యూ చేసారు. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











