రాజమౌళిని మించి పోయిన తమిళ దర్శకుడు
హైదరాబాద్: టాలీవుడ్లో వరుస విజయాలు అందుకుని విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.... ‘ఈగ' సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి'. దాదాపు 150 కోట్ల ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షక లోకం మాత్రమే కాదు...యావత్ ఇండియన్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా ఈచిత్రానికి భారీ సెట్ వేసారు. అయితే రాజమౌళిని మించిపోయేలా...... తమిళ దర్శకుడు చింబుదేవయన్ మరింత భారీ సెట్ వేసారు. తమిళ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతోన్న ‘పులి' చిత్రం కోసం ఆంధ్రప్రదేశ్ లోని తలకోన అడవుల్లోనే భారీ సెట్ వేసారు. దాదాపు 300 మంది టెక్నిషియన్స్ పనిచేసి భారీ విలేజ్ సెట్ ను నిర్మించారట. అక్కడ విజయ్, శృతిహాసన్ లపై కొన్ని సన్నివేశాల సహా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

‘పులి' సినిమాలో శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్స్. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. పీరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ వైవిధ్యమైన బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం 14వ శాతబ్దానికి చెందిన బ్యాక్ డ్రాపుతో సాగుతుంది. ఇందులో శ్రీదేవి మహారాణి పాత్రలో అనుష్క తల్లిగా నటిస్తోంది. తమిళ స్టార్ సుదీప్ ఈచిత్రంలో శ్రీదేవి భర్తగా నటిస్తున్నాడి, ఇద్దరి మధ్యలో ఓ లిప్ లాక్ సీన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఈ సినిమాకు ఆమె రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాహుబలి సినిమా విషయానికొస్తే...
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగా మే నెలలో విడుదల కానుంది. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











