'జల్సా' చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్టు 'పులి'. 'ఖుషి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్, రెహ్మాన్ కాంబినేషన్‌కి ఒక ప్రత్యేకమైన క్రేజి ఉంటుంది. వాస్తవానికి దాదాపు ఏడేళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. అది ఇప్పటికి కుదిరింది. ఆయన నేతృత్వంలో రెండుపాటల రికార్డింగ్ కూడా పూర్తయ్యాయి. పవన్ ఎస్.జె. సూర్యాల కాంబినేషన్‌లో రూపొందుతున్న మలి చిత్రం కావటం తో ట్రేడ్ లోనూ అప్పుడే అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ బానర్‌పై శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 23న షూటింగ్ ప్రారంభించి ఫస్ట్ షెడ్యూల్‌ను ఐదు రోజులలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.