పులి దిసీజ్ ద టైమ్ నౌ ఎంజాయ్ అంటూ సాగే ట్యూన్ తో ఓ పాట ఇంటర్నెట్లో లభ్యమవుతోంది. టైటిల్ సాంగ్ తో పాటు మరో సాంగ్ కూడా యూ ట్యూబ్లో దర్శనమిస్తోంది. ఇంతకుముందు కూడా జల్సా చిత్రం టైమ్ లో ఇలాగే మొదటి జల్సా టైటిల్ సాంగ్ ని నెట్ ద్వారా లీక్ చేసి క్రేజ్ సంపాదించారు. అవి పాటల ఆడియో సేల్స్ పై బాగా ప్రభావం చూపాయని అప్పట్లో చెప్పుకున్నారు. ముందుగా ట్రైల్ గా విడుదలైన ఆ పాట విని ఆడియో కోసం ఎదురుచూసేలా చేయటమే వ్యూహం అంటున్నారు. ఏదైమైనా పవన్ అభిమానులు ఈ పాటలను యూ ట్యూబ్లో వింటూ ఒకర్నొకరు పంపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లింక్ http://www.youtube.com/watch?v=zqDbuzvrb08&feature=related http://www.youtube.com/watch?v=2sEVYZFgI-s&feature=related
ఆసక్తి ఉన్న వాళ్ళు ఓ లుక్కేసి వినచ్చు...
Story first published: Thursday, April 23, 2009, 15:41 [IST]