‘మర్యాద రామన్న’, ‘పులి’ల డబుల్ ధమాకా...!?
సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మర్యాద రామన్న" ఈ రోజు (23.07.10)రాష్ట్రమంతటా 325 ప్రింట్లతో 400థియేటర్లలో విడుదలైంది కాగా ఈ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఖుషి డైరక్టర్ ఎస్ జె సూర్య ధర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'కొమరం పులి" సినిమా ట్రెలర్ ను థియేటర్ లో చూడొచ్చు.
'మర్యాద రామన్న" ఆడుతోన్న ప్రతి థియేటర్లోనూ 'కొమరం పులి" ట్రైలర్ ప్రదర్శించబడుతుందని ఈ చిత్ర నిర్మిత శింగనమల రమేష్ తెలిపాడు. ఈ ట్రైలర్ చాలా బాగుందని సమాచారమ్. పులి ఆడియో విడుదలతో పవన్ ఫ్యాన్స్ తో ఎఆర్ రెహమాన్ సంగీతానికి మార్కెట్ లో గుడ్ టాక్ తెచ్చుకొంటేంది. పవన్ ఫ్యాన్న్స్ పులి విడుదలకు ముందే మర్యాద రామన్నలో ట్రెలర్స్ చూడొచ్చొని తెగ సంబరపడిపోతున్నారు. ఇందంతా చూస్తోంటే ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా రికార్డ్సే అని ఫాన్స్ టాక్. సో..'మర్యాద రామన్న" చూడటానికి వెళితే 'కొమరం పులి" ట్రెలర్ చూడొచ్చన్నమాట. డబుల్ ధమాకా అంటే ఇదేనేమో...


Click it and Unblock the Notifications











