'పులివెందుల పులిబిడ్డ' మళ్లీ ప్రారంభం
షూటింగ్ 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది అనగా హఠాత్తుగా రాజశేఖరరెడ్డిగారు అకాల మరణానికి గురయ్యారు. దాంతో దిగ్బ్రాంతికి లోనై కొన్ని నెలల పాటు సినిమా అపేశాం. మళ్లీ ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపించి చిత్రాన్ని పూర్తిచేయడానికి నిశ్చయించుకున్నాం అంటున్నారు నిర్మాత పేర్నపాటి శ్రీవిష్ణు. ఆయన భానుచందర్ ప్రధాన పాత్రలో 'పులివెందుల పులిబిడ్డ' అనే చిత్రం రూపొందిస్తున్నారు. తిరువీధి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- "దివంగత నేత డా. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందరమ్మ ఇళ్లు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి చర్చిస్తూ...ఈ నేపథ్యంలో సాగే చక్కని కుటుంబ కథగా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మే నెలలో చివరి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. 20 రోజులు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. జూన్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి అంకితం ఇస్తున్నామని దర్శకుడు చెప్పారు.


Click it and Unblock the Notifications