రింగ్ పెట్టాక జరిగింది అదే.. ఎంగేజ్‌మెంట్ డ్రామాపై.. పునర్నవి భూపాలం
ఉయ్యాల జంపాల సినిమాతో పక్కింటి అమ్మాయిలా చాలా నేచురల్ గా కనిపించిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం ఒక్కసారిగా బిగ్ బాస్ షో ద్వారా గ్లామరస్ గర్ల్ గా మారిపోయిందనే చెప్పాలి. ఆ షో తరువాత చాలా మంది ఆమెకు ఫ్యాన్స్ అయ్యారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటివల ఆమె ఒక వెబ్ సిరీస్ గురించి ఊహించని విదంగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలపై పునర్ణవి ఒక క్లారిటీ ఇచ్చింది.

చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పునర్నవి
పునర్ణవి భూపాలం ఇటీవల సోషల్ మీడియాలో రింగ్ పెట్టి త్వరలోనే ఒక బిగ్ న్యూస్ చెప్పబోతున్నట్లు క్లారిటి ఇచ్చిన విషయం తెలిసిందే. అందరూ ఆమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది. పెళ్లి కాదు అది.. ఒక వెబ్ సిరీస్ అని అందరు మాట్లాడుకునేలా ప్రమోట్ చేసిన విధానం బాగానే వైరల్ అయ్యింది.

చాలా మంది బాధ పడ్డారు
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పునర్నవి దాని గురించి మాట్లాడుతూ.. మొదట నేను రింగ్ పెట్టగానే చాలా మంది బాధ పడ్డారు. మా కుటుంబ సభ్యులే వంద మందికి పైగా కాల్ చేశారు. ఊహించని విధంగా ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. కానీ నేను అంతకుముందే అలాంటి వెబ్ సిరీస్ చేస్తున్నాను అని కొందరికి తెలిసినప్పటికీ నమ్మలేదని చెప్పింది.

ప్రపోజల్ అనే దానిపైనే స్టోరీ నడుస్తుంది
ఇక మొత్తానికి వెబ్ సిరీస్ కమిట్ మెంటల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. నిజానికి అలా ఎనౌన్స్ చేయడానికి ఒక కారణం ఉంది. కథకు సంబంధించిన మెయిన్ పాయింట్ అదే. ప్రపోజల్ అనే దానిపైనే స్టోరీ నడుస్తుంది. పెళ్లికి ముందు ఈ రోజుల్లో ఉండే కొంత భయం గురించి అందరికి తెలిసే ఉంటుంది. అదే ఇందులో చూపించడం జరిగిందని పునర్నవి వివరణ ఇచ్చింది.

నిజంగా ఇంత వైరల్ అవుతుందని ఊహించలేదు
వైరల్ అయిన తరువాత వెంటనే క్లారిటీ ఇచ్చాము. అయినా కూడా మీ ఇద్దరికి నిజంగానే పెళ్లి అవుతోందా అని ఇంకా కొందరు అడుగుతున్నారు. నిజంగా ఇంత వైరల్ అవుతుందని ఊహించలేదు. మార్చ్ లోనే కమిట్ మెంటల్ వెబ్ సిరీస్ రావాల్సింది. కానీ కరోనా వలన ఆలస్యం అయ్యింది. పవన్ సాధినేని దర్శకత్వంలో 5 ఎపిసోడ్స్ తో రూపొందిన ఈ సిరీస్ తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని పునర్నవి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











