twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పునర్నవి టీనేజ్ సీక్రెట్.. 16 ఏళ్ల వయసులోనే ఆ అనుభవం.. ఓపెన్‌గా చెప్పేయడంతో అంతా షాక్

    |

    బిగ్ బాస్ సీజన్ 3లో తెగ హంగామా చేసింది పునర్నవి భూపాళం. ఈ సీజన్ లో అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను బుట్టలో వేసుకుంది. ఒక దశలో బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అనే సందేహం కూడా తెప్పించిన ఈ భామ.. అదే షోలో రాహుల్ తో నడిపిన రొమాంటిక్ ట్రాక్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ నేపథ్యంలో పలు యూ ట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్న ఈమె తాజాగా తన టీనేజ్ సీక్రెట్ బయటపెట్టింది. వివరాల్లోకి పోతే..

    రాహుల్, పునర్నవి.. అదే స్పెషల్ అట్రాక్షన్

    రాహుల్, పునర్నవి.. అదే స్పెషల్ అట్రాక్షన్

    బిగ్ బాస్ మూడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పార్టిసిపెంట్స్ మధ్య గొడవలు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు బుల్లితెర ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశాయి. చివరకు సీజన్ 3 విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, శ్రీ ముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో ముఖ్యంగా రాహుల్, పునర్నవి మధ్య ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ పాల్గొంటున్న ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర సంగతులు బయటకొస్తున్నాయి.

     టీనేజ్ సీక్రెట్.. ఆ వయసులో

    టీనేజ్ సీక్రెట్.. ఆ వయసులో

    ప్రతీ వ్యక్తికి టీనేజ్ సమయం అనేది ఎంత ముఖ్యమైనదో అంతే విలువైంది కూడా. ఆ వయసులో చేసిన కొన్ని పనులు జీవితాతం అలా గుర్తుంది పోతాయి. ఇక రొమాంటిక్ సంగతులైతే మరీను. ఇలాంటి ఓ ఆసక్తికర సందర్భం పునర్నవి టీనేజ్ వయసులో కూడా ఉందట. ఆ సీక్రెట్ స్వయంగా వెల్లడించింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

    16 ఏళ్ల వయసులోనే ఆ అనుభవం

    16 ఏళ్ల వయసులోనే ఆ అనుభవం

    తన 16 ఏళ్ల వయసులోనే ఫస్ట్ కిస్ టేస్ట్ చేశానని, అది అలా జరిగిపోయిందంటూ చెప్పి ఒక్కసారిగా షాకిచ్చింది పునర్నవి. ఆమె చేసిన ఈ సంగతులు విని.. ఇప్పుడే కాదు అప్పుడు కూడా పునర్నవి చాలా ఫాస్టే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పోతే రాహుల్- పునర్నవి రొమాంటిక్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇటీవలే ఈ ఇష్యూపై ఇద్దరూ స్పందిస్తూ తమ మధ్య ఏదీ లేదని క్లారిటీ ఇచ్చేశారు.

    Recommended Video

    Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
     పునర్నవి సినీ జర్నీ

    పునర్నవి సినీ జర్నీ

    ఇక పునర్నవి సినిమాల విషయానికొస్తే.. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత ‘పిట్టగోడ' అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేం ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు తెచ్చిపెడుతోంది.

    English summary
    Bigg Boss Season 3 Telugu participent Punarnavi open comments on her teenage life. She Says about her first kiss experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X