For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వితిక సోదరి వివాహాం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. పిక్స్ వైరల్

    |

    బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎంత బాగా కలిసి ఉంటారో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా కూడా బయటకు వచ్చాక అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్, పునర్నవి, అలీ రెజా, రవికృష్ణ, హిమజ, శివజ్యోతి ఇలా అందరూ కలిసి రచ్చ చేస్తుంటారు. తాజాగా ఇప్పుడు వితిక షెరు సోదరి కృతిక షెరు పెళ్లిలో సందడి చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

    Bigg Boss Telugu Season 3 : Reasons Behind Srimukhi Loss The Bigg Boss Title
    నిశ్చితార్థం రోజు..

    నిశ్చితార్థం రోజు..

    వితిక షెరు సోదరి కృతిక నిశ్చితార్థం ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇందులో వరుణ్ సందేశ్, వితికలు కలిసి కొత్త జంటను ఆశీర్వాదించారు. ఈ మేరకు దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

    నిశ్చితార్థంలో పునర్నవి..

    నిశ్చితార్థంలో పునర్నవి..

    వితిక ఇంట్లో స్పెషల్ ఉంటే అక్కడ పునర్నవి రావాల్సిందే. అయితే నిశ్చితార్థం వేడుకలో పునర్నవి సందడికి అంతా ఆశ్చర్యపోయినట్టు కనిపిస్తోంది. వితిక, పునర్నవిలు కలిసి నిశ్చితార్థం నాడు రచ్చ రచ్చే చేశారు. నిశ్చితార్థానికి రాని మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్లు పెళ్లిలో రచ్చ చేశారు.

    సెల్ఫీలతో సందడి..

    సెల్ఫీలతో సందడి..

    వితిక ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు బిగ్ బాస్ మూడు, నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు హాజరయ్యారు. హిమజ, శివజ్యోతి, రవికృష్ణ, లాస్య, అలీ రెజా భార్య మసూమ అందరూ కలిసి రచ్చ చేశారు. మొత్తానికి వితిక చెల్లి పెళ్లిలో బిగ్ బాస్ సభ్యుల రచ్చ ఓ రేంజ్‌లో ఉందని టాక్ వినిపిస్తోంది.

    పెళ్లి పెద్ద..

    పెళ్లి పెద్ద..

    ఇక తన చెల్లి పెళ్లిలో వితిక పెత్తనం చెలాయిస్తోందని.. పెళ్లి పెద్ద అంటూ శివ జ్యోతి కామెడీ చేసింది. పెళ్లికి వచ్చిన వారంతా దీవించండి.. అంటూ వితిక మైకులో అనౌన్స్ చేస్తోన్న వీడియోను శివ జ్యోతి షేర్ చేసింది. శివజ్యోతి, హిమజలు కలిసి వితికను ఆడుకున్నట్టు కనిపిస్తోంది.

    స్పెషల్ పిక్..

    స్పెషల్ పిక్..

    ఇక ఈ పెళ్లిలో పునర్నవి, వితికలు చేసిన అల్లరే ఎక్కువగా కనిపిస్తోన్నట్టుంది. ఇద్దరూ కలిసి ఎక్కడ పడితే అక్కడే ఫోటోలకు పోజులిస్తూ కనిపించారు. అయితే ఈ పెళ్లిలో మాత్రం రాహుల్, శ్రీముఖి వంటి వారు మిస్ అయినట్టు కనిపిస్తోంది.

    English summary
    Punarnavi himaja and shiva Jyothi In Vithika sheru sister Marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X