Just In
Don't Miss!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Finance
శాశ్వత నిషేధం, ఉద్యోగాల కోత ప్రారంభించిన టిక్‌టాక్
- Sports
World Tour Finals: ప్చ్.. తొలి రౌండ్లోనే ఓడిన సింధు, శ్రీకాంత్!!
- Automobiles
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
- News
వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వితిక షెరు సోదరి నిశ్చితార్థం.. సందడి చేసిన పునర్నవి.. పిక్స్ వైరల్
బిగ్ బాస్ కలిసిన బంధంతో పునర్నవి వితిక షెరు మధ్య మంచి బంధం ఏర్పడింది. బిగ్ బాస్ షోలో వరుణ్ సందేశ్ పునర్నవి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ షిప్‌తోఉండేవారు. పైగా ఎంతో ప్రేమతో రాఖీ కూడా కట్టేసింది. బిగ్ బాస్ ఇంట్లో అలా ఏర్పడిన బంధం బయటకు వచ్చాక కూడా కంటిన్యూ అవుతూ వస్తోంది. అందుకే వితిక షెరు సోదరి పెళ్లి అంటే పునర్నవి సందడే అంతటా కనిపిస్తోంది. తాజాగా వితిక షెరు తన చెల్లి నిశ్చితార్థం గురించి ఓ పోస్ట్ చేసింది.

వరుణ్ సందేశ్ స్పెషల్ పోస్ట్..
తన మరదలి నిశ్చితార్థం సందర్భంగా వరుణ్ సందేశ్ చేసిన పోస్ట్ వైరల్అవుతోంది. ఆ పోస్ట్‌లో వరుణ్ సందేశ్ కామెడీ టైమింగ్ కూడా కనిపిస్తోంది. హెయిర్ స్టైల్, నో మేకప్ బై వరుణ్ సందేశ్ అంటూ సింపుల్‌గా రెడీ అయ్యానంటూ చెప్పకనే చెప్పేశాడు.

పిక్స్ వైరల్..
వరుణ్ సందేశ్ షేర్ చేసిన పోస్ట్, ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కృతిక షెరు నిశ్చితార్థం సంద్భరంగా కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చాడు. మీ జీవితం మొత్తం సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

పునర్నవి సందడి..
వితిక షెరు సోదరి కృతిక షెరు నిశ్చితార్థంలో అల్లరి పిల్లలా పునర్నవి రచ్చ చేస్తోంది. పునర్నవి పెద్ద దానిలా.. వితికను దీవిస్తోంది.. హ్యాపీగా ఉండు అంటూ పునర్నవి దీవించిన ఫోటోను వితిక షేర్ చేసింది. ఆంటీ అంటూ వితిక రివర్స్ కౌంటర్ వేసింది.

స్పెషల్ ఫోటోలు..
నిశ్చితార్థం సందడి అంతా ఒక వైపు జరుగుతూ ఉంటే పునర్నవి మాత్రం తన ఫోటో షూట్ సెషన్‌తో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి పునర్నవి షేర్ చేసిన ఫోటోలను వితిక మళ్లీ పోస్ట్ చేసింది. పర్ఫెక్ట్ పిక్చర్ అంటూ పునర్నవిని తెగ పొగిడేసింది.

రాహుల్ మిస్..
మామూలుగా అయితే రాహుల్, పునర్నవి, వరుణ్, వితికలు ఉంటేనే ఆ ఫ్రేమ్ ఫుల్ ఫిల్ అవుతుంది. అభిమానులుకూడా ఈ నలుగురిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అనుకుంటారు. ఇలా ఈ నిశ్చితార్థపు ఈవెంట్‌లో రాహుల్ సిప్లిగంజ్ ఎందుకు లేడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.