భర్త చనిపోయినా ముత్తైదువలా రేఖ.. నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటారంటే..
బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, రేఖ ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా వారి మధ్య అఫైర్ నడిచింది. అయితే అనుకొని పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ జయబాధురిని అమితాబ్ పెళ్లి చేసుకోవడంతో వారి మధ్య బ్రేకప్ జరిగింది. అయినా అమితాబ్ అంటే రేఖకు చెప్పలేనంత ప్రేమ. ఇప్పటికీ ఆ ప్రేమ ఎంతగా ఉందనే విషయాన్ని వివాదాస్పద విలన్ పునీత్ ఇస్సార్ భార్య ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. భర్త చనిపోయినా నుదటి సింధూరం ఎందుకు పెట్టుకొంటారనే విషయాన్ని చెబుతూ..

నా భర్తపై పీకల్లోతు కోపం
నా భర్త పునీత్ ఇస్సార్ అంటే రేఖకు చాలా కోపం. కూలీ షూటింగ్‌లో అమితాబ్ ప్రమాదానికి గురై మరణం అంచుల వరకు వెళ్లి రావడానికి కారణం నా భర్త పునీత్ ఇస్సార్ అని ఆమెకు పీకల్లోతు కోపంగా ఉంటుంది. పలు సందర్భాల్లో ఎదురుపడినా ఇప్పటికీ తన భార్తను కనీసం కన్నెత్తి చూడరు. మాట్లాడరని చెప్పారు. అందుకు కారణం అమితాబ్‌పై రేఖకు ఉన్న పిచ్చి ప్రేమనే అని ఆమె తెలిపారు.

నా భార్తకు ఆరేళ్లపాటు ఆఫర్లే లేవు
అమితాబ్ ప్రమాదానికి గురైన తర్వాత పునీత్ ఇస్సార్ అంటే చాలా మందికి నచ్చలేదు. బిగ్‌బీకి అలా జరగడానికి కారణం మా ఆయనే అనే మూఢనమ్మకంతో సినిమాలకు దూరంగా ఉంచారు. ఆరేళ్లపాటు కనీసం ఒక్క ఆఫర్ కూడా ఇవ్వలేదు. కెరీర్ ముగిసిందనుకొనే సమయంలో చివరకు మహాభారత్‌లో ధుర్యోధనుడి పాత్ర లభించడంతో మళ్లీ నా భార్తకు మంచి రోజులు వచ్చాయి అని పునీత్ ఇస్సార్ భార్య చెప్పారు.

అమితాబ్ కోసం రేఖ
రేఖ భర్త చనిపోయినా ఇంకా ముత్తైదువగా ఉండటానికి కారణం అమితాబ్. ఆయన బతికి ఉన్నారనే ఒకే కారణంగా ఆయన కోసం నుదుట సింధూరం పెట్టుకొంటారు. బిగ్‌బీ అంటే రేఖకు పిచ్చి ప్రేమ ఉండటమే కారణం. ఇప్పటికీ అమితాబ్‌ను ఎవరైనా ఏమైనా అంటే సహించలేదు. వారి మధ్య ఇప్పటికీ చచ్చేంత ప్రేమ ఉంది అని పునీత్ ఇస్సార్ భార్య వెల్లడించారు.
Recommended Video

పునీత్‌కు అమితాబ్ ఊరట
అమితాబ్ గాయం నుంచి కోలుకొన్న తర్వాత పునీత్ ఇస్సార్‌ను ఓ సందర్బంలో కలిశారు. పునీత్ ఇస్సార్ తప్పులేదని స్వయంగా బిగ్ బీ చెప్పడంతో కొంత ఊరట లభించింది. షూటింగ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నింటిని మనం తప్పించుకోలేం. దానిని పట్టించుకోవద్దని అమితాబ్ చెప్పారనే విషయాన్ని పునీత్ ఇస్సార్ భార్య పేర్కొన్నారు. అమితాబ్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో తాను కూడా ఆయనకు రక్తదానం చేశాను చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











