పునీత్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. పునీత్ మరణం మరువక ముందే మరొకరు గుండెపోటుతో మృతి!

గత ఏడాది పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నడ సినీ అభిమానులు సహా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆ షాక్ నుంచి ఇంకా బయటపడలేదు. పునీత్ రాజ్ కుమార్ భార్య ఇంకా పునీత్ లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే

కార్డియాక్ అరెస్ట్ కారణంగా

కార్డియాక్ అరెస్ట్ కారణంగా

కర్ణాటక సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఆరోజు ఉదయం కూడా జిమ్లో కసరత్తులు చేసిన పునీత్ రాజ్ కుమార్ తన గుండెల్లో కొంచెం నొప్పిగా అనిపిస్తోందని దగ్గర్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్ కి వెళ్ళారు. అయితే ఇదేదో గుండె సమస్యలా అనిపిస్తోందని త్వరగా గుండె స్పెషలిస్ట్ వద్దకు వెళ్లాలని డాక్టర్ సూచించి ఆ హాస్పిటల్ కి ఫోన్ చేసి బెడ్ కూడా రెడీ చేసి ఉంచమని చెప్పారు. అయితే పునీత్ రాజ్ కుమార్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే కన్నుమూశారు.

ప్రతి ఒక్కరూ

ప్రతి ఒక్కరూ

పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో యావత్ కన్నడ రాష్ట్రమే కాక తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశాయి. అప్పటిదాకా ఆయన గురించి తెలియని వారు కూడా ఆయన మృతి చెందిన తర్వాత తెలుసుకుని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఎంత మంచి వ్యక్తో తెలిసిన తరువాత ప్రతి ఒక్కరూ ఆయన మరణానికి బాధ పడ్డారు.

పునీత్ మామ

పునీత్ మామ

అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత రాజ్ కుమార్ కుటుంబానికి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పునీత్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. ఫిబ్రవరి 20న ఆయన మృతి చెందడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తండ్రి భాగమనే రేవనాథ్ వయసు 78 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితం రేవనాథ్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.

పునీత్ మరణంతో

పునీత్ మరణంతో

రేవనాథ్ ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్ ఇంజనీర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఆయన బెంగళూరులోని M.S. రామయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతూమరణించారు. కొన్ని నెలల క్రితమే గుండెపోటుతో పునీత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో అశ్విని పునీత్ రాజ్‌కుమార్ షాక్ అయ్యారు. ఆమె ఆ షాక్ నుంచి కోలుకోకముందే పంపిన కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ రోడ్డుకు పునీత్ పేరు

ఆ రోడ్డుకు పునీత్ పేరు

గత సంవత్సరం గుండెపోటుతో మరణించిన దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ దుకు నివాళులర్పిస్తూ, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఔటర్ రింగ్ రోడ్ (ORR) యొక్క 12 కిలోమీటర్ల విస్తీర్ణానికి పునీత్ పేరు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బన్నెరఘట్ట రోడ్‌లోని నాయండహళ్లి జంక్షన్ మరియు వేగా సిటీ మాల్ జంక్షన్ మధ్య పునీత్ పేరు పెట్టబోతోంది నగరపాలక సంస్థ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X