For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Puneeth Rajkumar James Twitter Review: పునీత్ చివరి మూవీకి అలాంటి టాక్.. సినీ చరిత్రలోనే తొలిసారి!

  |

  కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న వయసులోనే తన టాలెంట్లను నిరూపించుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందారు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఈయన కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. చనిపోయే ముందు పునీత్ 'జేమ్స్' అనే సినిమాలో నటించారు. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పునీత్ ఆఖరి చిత్రం కావడంతో కన్నడ ప్రేక్షకులు దీన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. దీంతో ఇప్పటికే షోలన్నీ బుక్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు 'జేమ్స్' మూవీ ఎలా ఉంది? దీనిపై ప్రేక్షకులు ఎలాంటి స్పందనను అందిస్తున్నారు? అనేవి తెలుసుకుందాం పదండి!

  ‘జేమ్స్’గా వచ్చేసిన పవర్ స్టార్

  ‘జేమ్స్’గా వచ్చేసిన పవర్ స్టార్

  పునీత్ రాజ్‌కుమార్ హీరోగా చేతన్ కుమార్ తెరకెక్కించిన చిత్రమే ‘జేమ్స్'. ప్రియా ఆనంద్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ దీన్ని నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ కూడా కీలక పాత్రను చేశాడు. చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక, ఈ మూవీలో పునీత్ పాత్రకు అన్న శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.

  బీచ్‌లో తడిచిన బట్టల్లో అమలా పాల్ రచ్చ: అదొక్కటే అడ్డంగా పెట్టుకుని మరీ ఘాటుగా!

  అంచనాలను పెంచిన అప్డేట్స్

  అంచనాలను పెంచిన అప్డేట్స్

  పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ‘జేమ్స్' మూవీ ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే దీని విడుదల సమయంలో చాలా చిత్రాల రిలీజ్‌ను ఆపేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్లకు భారీ స్పందన దక్కింది. దీంతో రికార్డులు బద్దలవడంతో పాటు సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

  బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్ రిలీజ్

  బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్ రిలీజ్


  పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్నాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ‘జేమ్స్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు శాండిల్‌వుడ్ మీడియా రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు, దీన్ని కన్నడ చిత్ర పరిశ్రమలోనే తొలిసారి ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎప్పుడో పూర్తైపోయాయి.

  భూమిక చావ్లా అందాల విందు: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

  జేమ్స్ సినిమాకు అలాంటి టాక్

  జేమ్స్ సినిమాకు అలాంటి టాక్

  లెజెండరీ హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే టాక్ వచ్చింది. అసలు ఇందులో మైనస్‌లే లేవన్నట్లుగా ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలాగ

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలాగ

  ‘జేమ్స్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పునీత్ రాజ్‌కుమార్ మాస్ ఇంట్రో సీన్‌తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా ఉంటుందట. అలాగే, సెకెండాఫ్ కూడా అదే రితిలో ఉంటూ కొన్ని భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో సాగుతుందట. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేశారని టాక్.

  బికినీతో కుర్రాడి కోరిక తీర్చిన దిశా పటానీ: హాట్ పిక్ అడగ్గానే ఇలా.. అసలు ట్విస్ట్ తెలిస్తే!

  సినిమాలో ప్లస్‌... తొలిసారి ఇలా

  సినిమాలో ప్లస్‌... తొలిసారి ఇలా

  పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ‘జేమ్స్' మూవీని అందరూ పాజిటివ్‌గానే చూస్తున్నారు. దీంతో ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేష్, కథ, కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, మరీ ముఖ్యంగా పునీత్ స్క్రీన్ ప్రజెన్స్ ఇలా ఎన్నో ప్లస్‌లు ఉన్నాయట. కానీ, దీనికి సినీ చరిత్రలోనే తొలిసారి మైనస్‌లు ఎవరూ చెప్పడం లేదు.

  Megastar Chiranjeevi : Puneeth Rajkumar James Movie FDFS చూస్తా | Filmibeat Telugu
  ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది?

  ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది?

  ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘జేమ్స్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పూర్తిగా అభిమానులను అలరించే చిత్రం అని తెలుస్తోంది. ఇందులో అన్నీ అదుర్స్ అనేలా ఉన్నాయట. పవర్ స్టార్ చివరి చిత్రం కావడంతో ఇది తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటికే కర్నాటక మొత్తం పునీత్ నామస్మరణ వినిపిస్తోంది.

  English summary
  Puneeth Rajkumar Last Movie James Releasing Today. This Movie Directed By Chethan Kumar. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X