RIP #PuneethRajkumar.. గుండె ముక్కలైంది.. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, పూజా హెగ్డే, సంజన గల్రాని ఎమోషనల్
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఆయన మరణ వార్త వినగానే నమ్మలేకపోతున్నామంటూ పలువురు విషాదంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు సినీ తారలు గుర్తు చేసుకొంటూ మనో వేదనకు గురవుతున్నారు. ఇలాంటి విషాద పరిస్థితుల్లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, పూజా హెగ్డే తదితరులు ట్విట్టర్‌లో స్పందిస్తూ..

బాల నటుడిగా ఎన్నో పురస్కారాలు
ప్రముఖ కన్నడ కథానాయకుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నమ్మశక్యం కాలేదు. శ్రీ పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.ప్రముఖ నటులు,కన్నడ కంఠీరవ దివంగత శ్రీ రాజ్ కుమార్ గారి కుమారుడిగా ఆయన అడుగుజాడల్లో నట ప్రయాణం సాగిస్తున్న శ్రీ పునీత్ గుండెపోటుతో స్వర్గస్తులు కావడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
బాల నటుడిగానే కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆ దశలోనే ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కథానాయకుడిగా ఎన్నో విజయాలు దక్కించుకొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీ పునీత్ అనూహ్యంగా మృతి చెందటం సినీ ప్రేక్షకులకు బాధాకరం. శ్రీ పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

భారతీయ సినిమాకు తీరని లోటు
పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తతో విషాదంలో మునిగిపోయిన పూజా హెగ్డే ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నమ్మశక్యంగా లేదు. జీవితం అనూహ్యమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఇండియన్ సినిమాకు తీరని లోటు. ఇలాంటి విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. చాలా విచారంగా ఉంది. పునీత్ ఫ్యాన్స్‌కు మనోధైర్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను అని పూజా హెగ్డే ట్వీట్ చేశారు.

నా తొలి సినిమాకు అతిథిగా అంటూ పూజా హెగ్డే
పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని పూజా హెగ్డే గుర్తు చేసుకొన్నారు. నా మొట్ట మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఆయన అతిథిగా వచ్చారు. అద్భుతమైన మనసున్న వ్యక్తి. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. అలాంటి ఆయన ఇక లేరంటే నాకు చాలా బాధగా ఉంది అని పూజా హెగ్డే ట్వీట్ చేశారు.

గుండె ముక్కలైంది అంటూ ఎన్టీఆర్
పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ట్వీట్టర్‌లో స్పందిస్తూ.. పునీత్ ఇకలేరనే వార్తతో నా గుండె ముక్కలైంది. ఇంకా నమ్మశక్యంగా లేదు. ఇంత త్వరగా ఈ లోకం వీడి వెళ్లిపోతావని అనుకోలేదు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, పునీత్ మధ్య గాఢమైన ప్రేమానురాగాలు, బంధం ఉందనే విషయం తెలిసిందే.
Recommended Video

సంజన గల్రానీ వీడియో రిలీజ్ చేసి..
పునీత్ రాజ్‌కుమార్ మరణం గురించి సంజనా గల్రానీ వీడియోను రిలీజ్ చేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ ఉదయం నాకు ఓ వార్త తెలియడంతో షాక్ గురయ్యాను. వెంటనే నాకు తెలిసిన డాక్టర్లకు ఫోన్ చేసి తెలుసుకొనే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆయన సింపుల్‌గా ఉంటారు.
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడైనా అనే అనుమానం కలిగేది. హార్ట్ ఎటాక్ అనేది మనిషికి జీవితంలో మరో ఛాన్స్ ఇస్తుంది. కానీ పునీత్ విషయంలో అలాంటిది ఛాన్స్ ఇవ్వకపోవడం దిగ్బ్రాంతికరం. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వ్యక్తం మన మధ్య లేరంటే బాధగా ఉంది. నాకు ఏం చెప్పాలో మాటలు రావడం లేదు అని సంజన అన్నారు.


Click it and Unblock the Notifications











