ఆ హీరోయిన్ల చర్యలు తీసుకోవాలి: సౌమ్య
'మా"(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)లో సభ్యత్వం తీసుకోని హీరోయిన్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని..మరో హీరోయిన్ సౌమ్య వ్యాఖ్యానించారు. శుకవారం ఆమె హీడియాతో మాట్లాడుతూ ఇంత కాలం వారు వారు ప్రవర్తించిన తీరు 'మా"ను అవమాన పరిచే విధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి మళ్లీ పునరావృతం కావన్నారు. ఇటీవల విడుదలైన 'ముగ్గురు" సినిమా ద్వారా సౌమ్య లైమ్ లైట్ లోకి వచ్చింది.
'మా"లో సభ్యత్వం తీసుకోని కారణంగా తమన్నా, సమంత, ఇలియాన, తాప్సీ, జెనీలియా, నిత్యమీనన్, పార్వతి మెల్టన్, స్నేహ తో పాటు పలువరు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులపై నటులపై తెలుగు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నిషేదాస్త్రం సంధించించిన విషయం తెలిసిందే. నెలరోజులలోపు వారి స్పందన రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని 'మా" అధ్యక్షుడు మురళీ మోహన్ హెచ్చరించారు కూడా..


Click it and Unblock the Notifications











