»   » సల్మాన్ జైలు: చిరంజీవికి భిన్నంగా రేణు దేశాయ్ ట్వీట్

సల్మాన్ జైలు: చిరంజీవికి భిన్నంగా రేణు దేశాయ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మద్యం తాగి కారు నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ తప్పు చేసినప్పటికీ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఆయనకు మద్దతు ఇస్తూ వచ్చారు.

చివరకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన్ను వెనకేసుకొచ్చారు. చిరంజీవి స్పందిస్తూ... నా తోటి కళాకారుడు దోషిగా తేలడంపై నాకూ చాలా బాధగా ఉంది. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. కావాలని చేసింది కాదు. ఆయనకు పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ఆయనకు శిక్ష వేసే సమయంలో న్యాయమూర్తి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను. ఆయన నటిస్తున్న సినిమాలు పూర్తి చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ స్పందన మాత్రం చిరంజీవి ప్రకటకు పూర్తి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. సల్మాన్ ఖాన్ తప్పకుండా శిక్షింపబడాల్సిందే అని ఆమె ట్వీట్ చేసారు. ‘ఎంతో మంది అనాద, పేద పిల్లలు రోడ్లపై జంతువుల్లా జీవిస్తుండటం చూస్తుంటే నా గుండె పగిలినంత పనవుతోంది. నీడలేని పేదవారు వీధుల్లో పడుకోవడం ఇంతకంటే బాధారం ఏమీ కాదు. రోడ్లు ఉన్నవి వాహనాల కోసమే కాదనడం లేదు. కానీ అతని చర్యలకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. అంతకంటే ముఖ్యమైంది పౌరులకు కనీస అవసరాలైన ఆహారం, నివాసం లాంటి సౌకర్యాలు కల్పించడం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను అంటూ రేణు దేశాయ్ సల్మాన్ ఖాన్ కేసులో తీర్పుపై ట్వీట్ చేసారు.

English summary
It breaks my heart to see kids or grownups live on the roads like animals. Isn't it more painful that humans have to sleep on the roads? Roads are for vehicles. Punishing him is necessary but more important is to solve the basic food and shelter issue of lakhs of our poor citizens. Hope government takes positive constructive steps towards it”, said Renu, responding on the Salman Khan verdict.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu