CCL 2023: తెలుగు వారియర్స్‌కు షాక్.. థమన్, అఖిల్ మ్యాజిక్ వృథా.. టాప్ నుంచి ఆ స్థానానికి డౌన్

ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది సినిమా వాళ్లు క్రికెట్ టోర్నీ ఆడితే అది ఎంతటి సక్సెస్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అలా కొంత కాలం క్రితం మొదలెట్టిందే 'సెలెబ్రిటీ క్రికెట్ లీగ్' (సీసీఎల్). ఇటీవలే ఇది మరో సీజన్‌ను మొదలు పెట్టుకుంది. ఇందులో తెలుగు వారియర్స్ టీమ్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అందుకు అనుగుణంగానే మొదటి రెండు మ్యాచ్‌లలో గెలిచి టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో మన టీమ్‌కు షాక్ తగిలింది. ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

రెండు విన్స్ తర్వాత పంజాబ్‌తో

రెండు విన్స్ తర్వాత పంజాబ్‌తో

దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న 'సెలెబ్రిటీ క్రికెట్ లీగ్' (సీసీఎల్) కొత్త సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో గతంలో పలుమార్లు టైటిల్ గెలిచిన తెలుగు టైటాన్స్ జట్టు మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. మూడో దాన్ని సోనూ సూద్ నేతృత్వంలోని పంజాబ్ దే షేర్ టీమ్‌తో శనివారం బెంగళూరులో తలపడింది.

మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ఇలా

మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ఇలా

సీసీఎల్‌ మ్యాచ్‌లు రెండేసి ఇన్నింగ్స్‌ల చొప్పున ఆడుతోన్న విషయం తెలిసిందే. ఇక, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ జట్టు పది ఓవర్లు ముగిసే సమయానికి 98 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టులో అఖిల్ 28 (14), థమన్ 37 (18) మ్యాజిక్ చేశారు. పంజాబ్ బౌలర్లలో సుయ్యాస్ రెండు ఓవర్లలో 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

పంజాబ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ స్కోర్

పంజాబ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ స్కోర్

ఇక, ఈ మ్యాచ్‌లో పంజాబ్ దే షేర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా నిర్ణీత పది ఓవర్లలో 101 పరుగులు చేసింది. ఈ జట్టులో బబ్బల్ రాయ్ ఏకంగా 32 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. తెలుగు బౌలర్లలో థమన్, రఘు, అశ్విన్, సామ్రాట్ తలో వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు.. తెలుగు వారియర్స్‌పై మూడు పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

తెలుగు రెండో ఇన్నింగ్స్ ఇలా

తెలుగు రెండో ఇన్నింగ్స్ ఇలా

మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప (3) పరుగుల లోటును అందుకున్న తెలుగు వారియర్స్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తా చాటింది. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో అంతగా రాణించకున్నా.. రెండో దానిలో తెలుగు వారియర్స్ నిర్ణీత పది ఓవర్లలో 112 పరుగులు చేసింది. మన జట్టులో అక్కినేని అఖిల్ 27(14), అశ్విన్ బాబు 32(15) నిఖిల్ 19(11) రాణించి మంచి స్కోర్‌ను అందించారు.

పంజాబ్ ముందు భారీ లక్ష్యం

పంజాబ్ ముందు భారీ లక్ష్యం

రెండో ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులకు ఫస్ట్ ఇన్నింగ్స్ లోటును తీసేస్తే తెలుగు వారియర్స్ జట్టు.. పంజాబ్ ముందర 109 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక, ఈ టార్గెట్‌ను ఆ జట్టు 9.3 ఓవర్లలోనే ఛేదించింది. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం ఉండగా.. రఘు వేసిన మూడు బంతుల్లోనే అనూజ్ 2, 6, 1 పరుగులు చేసి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.

మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు వీళ్లే

మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు వీళ్లే

కెప్టెన్ సోనూసూద్ లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్ జట్టు తెలుగు వారియర్స్‌పై ఆధిపత్యాన్ని చూపించి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఆ జట్టులో మొదటి ఇన్నింగ్స్‌లో బబ్బల్ 62 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే, రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయూర్ ఏకంగా 31 బంతుల్లోనే 70 పరుగులు చేసి పంజాబ్ షేర్ జట్టుకు విజయాన్ని అందించాడు.

ఒక్క ఓటమితో నాలుగో స్థానం

ఒక్క ఓటమితో నాలుగో స్థానం

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు తెలుగు వారియర్స్ జట్టు 4 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓటమితో నెట్ రన్‌రేట్ బాగా తగ్గిపోయింది. దీంతో మన జట్టు ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కర్నాటక, భోజ్‌పురి టాప్ 2 ప్లేసుల్లో ఉండగా.. పంజాబ్ 5వ స్థానానికి చేరింది. ఇక, తెలుగు వారియర్స్ తన తదుపరి మ్యాచ్‌ను మార్చి 12వ తేదీన చెన్నైతో తలపడనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X