ముమైత్ బికినీ షో ఎప్పుడంటే...
ఓ ప్రక్క ప్రియమణి, అనూష్క బికినీలతో రెచ్చగొడుతూంటే..తానేం తక్కువ తిన్నానా అనుకుందో ఏమో ఐటం బాంబ్ ముమైత్ ఖాన్ కూడా బికినీ తో కనిపించబోతోంది. సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రెడీ అవుతున్న 'పున్నమినాగు' చిత్రంలో బికినీ విన్యాసం కన్పడనుంది. హాలీవుడ్ 'డై అనదర్ డే' హీరోయిన్ హాలీ బెర్రీ తరహాలో ముమైత్ అదరకొట్టబోతోంది. ఈ చిత్రం ఈ నెల పదవ తేదీన(శుక్రవారం)రిలీజ్ కానుంది.
ఈ చిత్రం బాలీవుడ్ 'నాగిన్' తరహా థ్రిల్లర్ మూవీగా ఉండబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఇదే టైటిల్ తో గతంలో కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'పున్నమి నాగు' చిత్రం మంచి హిట్ కావడంతో సహజంగానే ముమైత్ సినిమాపై అంచనాలున్నాయి. ఆనాటి చిత్రంలో మ్యూజికల్ హిట్ సాంగ్ అయిన 'రగులుతోంది మెగలిపొద' పాటను ఇప్పటి సినిమాలో ముమైత్, రాజీవ్ కనకాలపై చిత్రీకరించడం ఈ సినిమాలోని మరో విశేషం.


Click it and Unblock the Notifications











