పురంధేశ్వరిగారు కన్ఫూజ్ అయ్యి నన్ను..రాజమౌళి
చాలా మంది వినయ్ గారిని,నన్ను ఎవరు ఎవరో తెలియక కన్ఫూజ్ అవుతూంటారు. కొద్ది రోజుల క్రితం పురందేశ్వరి గారు కూడా నన్ను వినాయిక్ గారు అంటూ సంభోధించారు అంటూ రాజమౌళి ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఇక 'ఈగ" చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి మార్కెట్లో మంచి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. యుఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి దాదాపు రెండు కోట్ల వరకూ పలికినట్లు సమాచారం. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











