అక్క పాదాలకు నమస్కరించిన బాలయ్య.. విద్యా బాలన్‌ని అలా అనకూడదు.. పురందేశ్వరి!
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎన్టీఆర్ కుమార్తె, రాజకీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడియో వేడుకలో ప్రసంగించారు. తమ్ముడు బాలయ్య నా కంటే చిన్నవాడు కాబట్టి నమస్కారం పెట్టలేను. కానీ ఆశీస్సులు అందిస్తా అంటూ పురందేశ్వరి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వెంటనే బాలయ్య తన సోదరి పాదాలకు నమస్కరించడం విశేషం.
ఎన్టీఆర్ జననం ఒక చరిత్రాత్మకం. తెలుగు జాతికి, ప్రజలకు వన్నె తెచ్చిన మహా నాయకుడు, కథా నాయకుడు ఎన్టీఆర్ అని పురందేశ్వరి అన్నారు. ఆయన జీవితాన్ని వెండి తెరపై తెరకెక్కించడం సాహసమే. కానీ ఆ సాహసాన్ని బాలయ్య విజయవంతంగా పూర్తి చేశాడు. తమ్ముడు ప్రతి సన్నివేశంలో నాన్నగారిలాగే ఉన్నాడు. ఇక విద్యాబాలన్ మా తల్లి పాత్ర పోషించింది. పోషించింది అని అనకూడదు. జీవించింది అని అనడం సబబు అంటూ పురందేశ్వరి ప్రశంసలు కురిపించారు. ఈచిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.



Click it and Unblock the Notifications











