పవన్ ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో నాకు తెలుసు

By Srikanya

హైదరాబాద్ : ''ఇన్నేళ్ల విరామం తరవాత మళ్లీ పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో నాకు తెలుసు. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. రాంబాబు పాత్రలో కొత్త పవన్‌ని చూస్తారు. మణిశర్మ అందించిన బాణీలు బాగున్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు పూరీ జగన్నాధ్. పూరీ జగన్నాధ్,పవన్ కళ్యాణ్ తో... ప్రస్తుతం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'గా సిద్ధమవుతున్నారు. ఆదివారం పవన్‌కల్యాన్‌ జన్మదినం. ఈ సందర్భంగా పూరీ ఇలా స్పందించారు.

'బద్రి' తరవాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 18న విడుదల చేయాలనుకొన్నారు. కానీ ఇప్పుడు వారం రోజుల ముందే.. అంటే అక్టోబరు 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కి మణిశర్మ స్వరపరిచిన పాటలను ఈ నెలలోనే విడుదల చేయడానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా పవన్ కనిపించనున్నారు. శక్తివంతమైన కథాంశంతో, పూర్తి ఎంటర్‌టైనర్‌గా పూరిజగన్నాథ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని దానయ్య తెలిపారు. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో తీపి జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా ఇది అవుతుందని పూరిజగన్నాథ్ చెబుతున్నారు.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.

ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

పవన్ కళ్యాణ్ కి ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X