మహేష్ సెంటిమెంట్ అది: పూరీ
''పోకిరి సినిమా స్నేహితులతో కలిసి ఉదయం ఆట నర్సీపట్నంలోనే చూశాను. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ సెంటిమెంట్‌తోనే 'బిజినెస్‌మేన్' చిత్రం కూడా నర్సీపట్నంలోనే చూడమని మహేష్‌బాబు కోరాడు ''అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన గురువారం రాత్రి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడారు. పూరి రూపొందించిన 'బిజినెస్‌మేన్' ఈ రోజు(శుక్రవారం)విడుదలవుతోంది. అలాగే..''మహేష్ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడే ఉదయం ఆట నా సినిమా చూస్తాను. రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 18వందల థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, పాటలు, ప్రచారచిత్రాలను సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకొనే సౌకర్యం కల్పించాం. మహేష్ ఇందులో 'పోకిరి'కి భిన్నమైన పాత్రలో కనిపిస్తాడ'' అన్నారు.
ఇక పూరిని ఆయన తర్వాత చేయబోయే చిత్రాల గురించి అడిగితే..''రవితేజతో చేసే చిత్రం త్వరలో మొదలవుతుంది. ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం ఉంటుంది''అన్నారు. ఇక ఈ రోజు విడుదల అవుతున్న 'బిజినెస్‌మేన్'చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. పోకిరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఆ రేంజిని దాటి హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ గా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మహేష్ సైతం దూకుడు కలెక్షన్స్ ని మించి కొత్త రికార్జులని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











