ఇద్దరమ్మాయిలతో అల్లు అర్జున్ ఖరారు
హైదరాబాద్: అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సెప్టెంబర్ 20న ముహూర్తం జరుగుతుందని, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిసింది. శ్రుతి హాసన్ ఓ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలిసింది. మరో హీరోయిన్ ఎవరనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. చక్రి స్వరాలు సమకూరుస్తారు. అర్జున్ - పూరిల నుంచి 'దేశముదురు' తరవాత రూపొందుతున్న చిత్రమిదే.
ఇక అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి' రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పేరు రవి. అతని క్యారక్టేర్ డిఫెరెంట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ నోటివెంట వచ్చే త్రివిక్రమ్ డైలాగ్స్ వల్ల థియేటర్లన్నీ విజిల్స్‌తో నిండిపోవడం ఖాయం. అల్లు అర్జున్ ఎనర్జీ, అబ్బురపరిచే ఆయన డాన్సులు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి అంటున్నారు చిత్ర సమర్పకులు దానయ్య. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని డీటీఎస్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు నిర్మాత కె.రాధాకృష్ణ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
అల్లు అర్జున్ క్యారెక్టర్ ప్రకారం ఏమిటంటే...చదరంగం అంటే ఏమిటి? ఎన్ని గడులు ఉంటాయి? ఏ పావుని ఎలా కదపాలి? ఇలాంటి విషయాలన్నీ తెలిసినవాడితో చదరంగం ఆడడం, అందులో గెలవడం సులభమే. అయితే ఇవేమి పట్టకుండా... తనకు తెలిసిన పద్ధతిలోనే ఆడతానని పట్టుబడితే అతన్ని ఓడించడం కష్టం. రవి అలాంటి కుర్రాడే. ప్రయాణంలో పది దారులు ఎదురుపడితే పదకొండో మార్గం ఎంచుకొంటాడు. అందరూ రిస్కూ అంటుంటే అందులోనే కిక్కు ఉందని నమ్ముతాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఓ ఆట మొదలెట్టాడు. ఇంతకీ ఈ ఆటలో గెలిచాడో లేదో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











