twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ‘కెమెరామేన్ గంగ’అనే టైటిల్ పెట్టాను

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''అందంగా ఉంటుందని తమన్నాను తీసుకున్నాం. కానీ ఆ అమ్మాయి ఎంత బాగా చేసిందో. 'కెమెరామేన్ గంగ'అనగానే అందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్న మాట నిజం. మగాళ్లకి నేనేం తక్కువ కాదు అనుకునే రకం ఇందులో తమన్నా. తనను 'కెమెరామేన్' అనే పిలవమంటుంది. అందుకే టైటిల్ అలా పెట్టాం. ఇందులో ప్రకాష్‌రాజ్, పవన్‌కల్యాణ్ మధ్య సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి'' అని పూరీ జగన్నాధ్ చెప్పారు.

    అలాగే ''ప్రపంచంలో ఎవరిపని వాళ్లు సవ్యంగా చేసుకోవడంలేదు కాబట్టే... పరిస్థితిని చక్కదిద్దడానికి మూడో మనిషి అవసరం అవుతోంది. ఆ మూడో వ్యక్తే 'ప్రెస్'. సమాజానికి ప్రశ్నార్థకంగా మారిన ఓ పొలిటీషియన్‌కీ, ఓ జర్నలిస్ట్‌కీ మధ్య జరిగిన పోరాటమే 'కెమెరామేన్ గంగతో రాంబాబు. పవన్‌కల్యాన్ అభిమానులకు కన్నుల పండుగ ఈ సినిమా'' అని పూరి జగన్నాథ్ అన్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం గురువారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పూరి మీడియాతో ముచ్చటించారు. అలాగే

    జర్నలిజం పై తన అభి ప్రాయం చెప్తూ-''ఈ సినిమాలో ఓ డైలాగుంది 'మనం పోలీసులకు భయపడం, జనానికి భయపడం, తోటి రాజకీయనాయకులకు కూడా భయపడం. కానీ ఈ మీడియా యదవలకు భయపడాల్సి వస్తుంది' అంటాడు కోట. మీడియా గొప్పతనం, దుష్టరాజకీయనాయకుల ఫ్రస్టేషన్ ఈ డైలాగు ద్వారా చెప్పాను. ఇందులో కొత్త పవన్‌కల్యాణ్‌ని చూస్తారు. క్లైమాక్స్ సన్నివేశానికి ముందు పవన్‌చెప్పే 4 నిమిషాల డైలాగ్ సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమాకు క్లైమాక్స్ ఓ పెద్ద ఎస్సెట్. సాధారణంగా క్లైమాక్స్ అంటే భారీ యాక్షన్ సీన్స్ కామన్. ఇందులో అసలు క్లయిమాక్స్ ఫైటే ఉండదు. మరి ఎలా తీశానో రేపు తెరపై చూస్తారు'' అన్నారు.

    పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    
 Puri Jagan clarifies about his latest film Cameraman Gangatho Rambabu title. And he also explained that it is a movie about a person who responds to media news and he himself becomes reporter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X