పూరి దర్శకత్వంలో పులి-నయన్

By Staff

ప్రస్తుతం 'పులి" బాద్యతలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ 'పులి" విడుదలైన వెంటనే పూరి జగన్నాద్ డైరక్షన్ లో నటుడు గణేష్ నిర్మించే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి ఆల్రెడీ స్టోరీలైన్ రెడి అయిపోయింది. ఇటీవల బ్యాంకాక్ లో జరిపిన స్టోరీ సిట్టింగ్స్ లో సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసుకున్నారు. 'నేనింతే" పూర్తి చేసిన పూరి ఇమ్మీడియట్ గా సాయిరాంశంకర్, బిందు మాధవి, ముమైత్ ఖాన్ తదితరుల్తో ఓ చిన్న చిత్రాన్ని రూపొందించనున్నాడు. దీనికి 'బంపర్ ఆఫర్" అనే టైటిల్ ఖరారుచేశారు. మార్చికల్లా షూటింగ్ పూర్తి చేసుకునే ఈ చిత్రం తర్వాత పూరి తన తొలి హీరో 'బద్రీనాధ్", పవన్కళ్యాణ్ సినిమాతో బిజీ అవుతాడు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు కధానాయికలు నటిస్తారు. ఒక హీరోయిన్ గా నయనతార ఎంపికైందని విశ్వసనీయంగా తెలిసింది. ఇంత వరకు పవన్ తో కానీ, పూరి డైరక్షన్ లో కానీ నటించని నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంటూ, తెలుగు సినిమాల విషయంలో చాలా సెలక్టివ్ గా ఉంటోంది. తన కోసమే కొంతమంది తన సినిమాలకు క్యూలు కట్టేంత క్రేజ్ సంపాదించుకున్న మలయాళ కుట్టి నయనతార ప్రస్తుతం ఎన్టీఆర్-వి.వి.వినయక్ల కలయికలో రూపొందుతున్న చిత్రంలో ప్రధాన హీరోయిన్గా నటిస్తున్న నయనతార ఈ చిత్రంలో తను ఆరబోసే అందాలు చూసి తన అభిమానులు మళ్లీ అదుర్స్ అనేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంకా కనీసం ప్రీప్రొడక్షన్ పనులైనా మొదలు కాకమందే అత్యంత క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రంలో అవకాశం దక్కినట్టయితే నయనతారకి తెలుగులోను దశతిరిగినట్టే!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X