హాట్ టాపిక్: ఉపేంద్ర సినిమా కాపీ కొట్టే 'బిజినెస్ మ్యాన్'?
ఉపేంద్ర, నయనతార కాంబినేషన్ లో కన్నడంలో వచ్చి విజయవంతమైన సూపర్ చిత్రం తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా ఆడని ఈ చిత్రం కాన్సెప్టు కాపీ కొట్టే పూరీ జగన్నాధ్ ఈ చిత్రం రూపొందించారంటూ కొత్త కాంట్రావర్శి మొదలైంది. కన్నడ మీడియా దీనిపై కథనాలు వెలువరిస్తోంది. సూపర్ చిత్రంలోనూ అండర్ వరల్డ్ ని కార్పోరేట్ లెవల్లో హీరో నడపంపై కథ నడుస్తుంది.బెంగుళూర్ లోని ఎక్కడెక్కడి రౌడీలను గూండాలను పోగుచేసి హీరో ఓ గ్యాంగ్ రెడీ చేసి దానితో సెటిల్ మెంట్స్ చేస్తూంటాడు. ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు పనికొచ్చే రకరకాల పనులు చేస్తూంటాడు. బిజినెస్ మ్యాన్ లోనూ మహేష్ బాబు ముంబై వచ్చి అక్కడ కూడా ఇలాగే దాదాలను, రౌడీలను పోగుచేసి కార్పోరేట్ స్ధాయిలో రౌడీయిజం చేస్తూంటాడు. రెండు చోట్లా కుళ్లు రాజకీయనాయకులపై పోరాటం ఉంటుంది.
అలాగే ఉపేంద్ర సినిమాలో అతను ఎన్నారై. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇండియాకి ఏదో చేద్దామని వచ్చి ఇక్కడ పొలిటీషన్స్ వల్ల విసుగెత్తి అలా తయారవుతాడు. బిజినెస్ మ్యాన్ లో మహేష్ తండ్రి ఎన్నారై... అతను ఇండియాకు వచ్చి ఇక్కడ పొలిటీషన్స్ చేతిలో మోసపోయి చనపోతాడు. దాంతో మహేష్ ఈ అవతారం ఎత్తుతాడు. అలా ఈ రెండు సినిమాలకూ దగ్గర సంభందం ఉందని అక్కడ మీడియా చూపెడుతోంది. గతంలోనూ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో గురించి ఇలాగే టాక్ వచ్చింది. ఉపేంద్ర రూపొందించి, నటించిన హాలీవుడ్ చిత్రం ఆదారంగా ఆ చిత్రం కథ తయారైందని టాక్ వచ్చింది. ఇక ఇఫ్పుడు ఈ విషయమై ఉపేంద్ర ఏమంటారో చూడాలి... లేదా ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొని కన్నడంలో చేస్తానంటాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











