»   » పవన్ మ్యాటర్ పై పూరీ జగన్నాథ్ ఖండన

పవన్ మ్యాటర్ పై పూరీ జగన్నాథ్ ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : పవన్,పూరీ మధ్య విభేధాలున్నాయంటూ ఓ దినపత్రికలో ప్రముఖంగా ఓ నాలుగు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే దిన పత్రికలో పూరీ ఆ విషయాన్ని ఖండించారు. తమ మథ్య ఎటువంటి విభేదం లేదని, చాలా మంచి రిలేషన్ ఉందని ఆయన వివరణ ఇచ్చారు.

ఆ ఆంగ్ల దిన పత్రికలో వచ్చిన ఆ స్టేట్ మెంట్ లో యథాతథంగా....

'Pawan and I have always shared a cordial relationship and it's not right to say that I'll never work with him. I'm denying news of any rift between him and me'.


పవన్ కళ్యాణ్‌తో ఇక సినిమా చేయను అంటూ ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. అసలు ఆయన ఇలా ఎందుకు అన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అంతకు ముందు రోజే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యాడు.


'ఇద్దరమ్మాయిలో' చిత్రంలో 'ప్రతి ఎదవా పవన్ కళ్యాన్ ఫ్యానే' అనే డైలాగే అందుకు కారణం. మరి పవన్ అభిమానులు చేసిన నిరసనతో అప్ సెట్ అయ్యాడో? ఏమోగానీ.....పూరి వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 'బద్రి'‌తో టాలీవుడ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ తక్కువ టైం లో గొప్ప డైరెక్టర్ గా పేరు పొందిన సంగతి మనందరికి తెలిసిన విషయమే.

English summary
‘Pawan and I have always shared a cordial relationship and it’s not right to say that I’ll never work with him. I’m denying news of any rift between him and me’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu