దేవుడు ఆడే డ్రామా.. ('దేవుడు చేసిన మనుషులు' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్: రవితేజ, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు(ఆగస్టు 15) విడుదల అవుతోంది. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో పూరీ,రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్,అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రాలు హిట్ అవటం,ఇలియానా..రవితేజ కాంబినేషన్ ఈ చిత్రానికి క్రేజ్ తెచ్చాయి. వరస ప్లాప్ ల్లో ఉన్న రవితేజ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

కథ ప్రకారం రవి (రవితేజ) బ్యాంకాక్‌లో సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. ఎలాంటి వ్యవహారాన్నయినా తేలిగ్గా పరిష్కరించడంలో అతను దిట్ట. అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తుంటుంది ఇలియానా (ఇలియానా). వీరిద్దరికీ ఏ మాత్రం సంబంధం ఉండదు. కానీ చిన్న సంఘటనతో ప్రేమలోపడిపోతారు. వీరి ప్రేమకు కర్త, కర్మ, క్రియ అన్నీ విష్ణుమూర్తి (బ్రహ్మానందం). దేవుడు ఆడిన ప్రేమాటలో వీరిద్దరినే ఎందుకు పావులుగా చేసుకొన్నారు. ఇంతకీ రవి, ఇలియానా మధ్య ప్రేమ ఎలా చిగురించింది? మధ్యలో ప్రకాష్‌ (ప్రకాష్‌రాజ్‌) ప్రమేయం ఏమిటి? ఈ విషయాలతో సాగే కథ ఇది.

విశేషాలు:దర్శకుడు మాట్లాడుతూ ''ఇదే నా తొలి సోషియో ఫాంటసీ సినిమా. కథ, కథనాలు గమ్మత్తుగా ఉంటాయి. వినోదం పాళ్లు ఎక్కువ. రఘు కుంచె పాటలు హుషారుగా సాగాయి''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ..కథ ఫైనల్ అయ్యాక 'దేవుడు చేసిన మనుషులు' అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావించి, దాన్నే ఫైనల్ చేశాం. ఇందులో వినోదమే ప్రధానం. భిన్నమైన సోషియో ఫాంటసీ సాధారణంగా సోషియో ఫాంటసీలంటే మనుషులు దేవలోకాలకి వెళ్లడమో, లేకపోతే దేవుళ్లే భూలోకానికి రావడమో కనిపిస్తుంది. కానీ ఈ సినిమా అలా ఉండదు. ఏ లోకంలో ఉన్నవాళ్లు ఆ లోకంలోనే ఉంటూనే కథ నడస్తుంది. ఆ రకంగా ఇది భిన్నమైన కథ అన్నారు.

సంస్థ:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నటీనటులు: రవితేజ, ఇలియానా, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు, అలీ, ఫిష్‌ వెంకట్‌, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు
కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు,
సంగీతం: రఘు కుంచె,
పాటలు: భాస్క రభట్ల,
ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌,
ఫైట్స్‌: విజయ్‌,
డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌,
సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,
సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌,
ప్రొడక్షన్‌ డిజెనర్‌: చిన్నా,
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌
కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
విడుదల:ఆగస్టు 15, 2012

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X