For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'దేవుడు చేసిన మనుషులు' స్టోరీ లైన్

  By Srikanya
  |

  హైదరాబాద్: రవితేజ, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రం 15న విడుదల అవుతోంది. ఇందులో రవితేజ, ఇలియానా, ప్రకాశ్‌రాజ్ పాత్రలకు వారి నిజ జీవిత పేర్లే ఉంటాయి. రవితేజ సెటిల్‌మెంట్లు చేసే యువకుడిగా నటించాడు. అందులో భాగంగా బ్యాంకాక్‌కి వెళ్లి అక్కడ తారసపడిన ఆటో డ్రైవర్ ఇలియానా ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కథ ఏమిటన్నది తెరమీద చూడాలి.

  ఈ చిత్రం కథ గురించి నిర్మాత మాట్లాడుతూ..కథ ఫైనల్ అయ్యాక 'దేవుడు చేసిన మనుషులు' అనే టైటిల్ కరెక్ట్‌గా ఉంటుందని భావించి, దాన్నే ఫైనల్ చేశాం. ఇందులో వినోదమే ప్రధానం. భిన్నమైన సోషియో ఫాంటసీ సాధారణంగా సోషియో ఫాంటసీలంటే మనుషులు దేవలోకాలకి వెళ్లడమో, లేకపోతే దేవుళ్లే భూలోకానికి రావడమో కనిపిస్తుంది. కానీ ఈ సినిమా అలా ఉండదు. ఏ లోకంలో ఉన్నవాళ్లు ఆ లోకంలోనే ఉంటూనే కథ నడస్తుంది. ఆ రకంగా ఇది భిన్నమైన కథ అన్నారు.

  అలాగే సినిమా చూశాక కచ్చితంగా ఓ హిట్ సినిమా చేశామని అనిపించింది. గతంలో నా సినిమాల విషయంలో నా అంచనాలెప్పుడూ విఫలం కాలేదు. ఈ సినిమా మీద కూడా నా అంచనాలు నిజమవుతాయి. కథాకథనాలే బలం పూరి జగన్నాథ్‌తో పనిచేయడం చాలా సంతోషందాయకం. అసలు పని వత్తిడి అనేది ఉండదు. ఆయనతో సినిమా చేసిన భావమే కలగలేదు. అంత సునాయాసంగా ఆయన ఈ సినిమా చేశాడు. ప్రకాశ్‌రాజ్ పాత్ర అదిరిపోతుంది. అలీ కేరక్టర్ హైలైట్‌గా ఉంటుంది. ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేవి ఈ సినిమా కథాకథనాలే. అలాగే పాటలు కూడా అని చెప్పుకొచ్చారు.

  హీరో రవితేజ మాట్లాడుతూ... పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇది ఐదవ చిత్రం. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు వింటూంటే ఎంతో ఎక్సైట్ అయ్యాను. జగన్ కాంబినేషన్ లో మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నారు. ప్రకాష్‌ రాజ్‌, డాబ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్‌.నారా యణ, కోవెై సరళ, సుబ్బరాజు, ఫిష్‌ వెంకట్‌, జ్యోతిరానా తదితరులు నటిస్తున్నారు.కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్క రభట్ల, ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌, ఫెైట్స్‌: విజయ్‌, డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్‌, ప్రొడక్షన్‌ డిజెైనర్‌: చిన్నా, కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Ravi Teja's movie Devudu Chesina Manushulu (DCM) has finished its censor formalities. This film has attained the U/A certification and is likely to be released on the 15th of August. DCM has Ravi Teja is the leading role with Ileana being his lady love. It’s testing time for Ileana as this will be her second film to hit screens this month. Brahmanandam plays the crucial role of God. DCM is being directed by Puri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X