చిరు-పూరి అవునో కాదో మరి?
చిరుత సినిమాకు దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తన 149వ చిత్రం రూపొందాలని చిరంజీవి భావిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ సినిమాతోనే రాజకీయ అరంగేట్రం చేయాలని కూడా చిరంజీవి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 149వ సినిమా కోసం కృష్ణవంశి మొదలుకొని వివివినాయక్, గుణశేఖర్, శంకర్, పూరి జగన్నాథ్ ఇలా ఎన్నో పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ ఇపుడు చెన్నయ్ లోనే ఉన్నాడు. చిరంజీవి కూడా చెన్నయ్ కి వెళ్లి పూరి జగన్నాథ్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. పూరి కూడా రెడీ అన్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూరి స్టార్ట్ చేసినట్టు పుకార్లు గుప్పుమంటున్నాయి. తన 149వ సినిమాను రానున్న 7 ఏడునెలల్లో పూర్తి చేసి రాజకియాలలోకి ఎంటర్ కావాలని చిరంజీవి ప్రణాళిక తో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల భొగట్టా. సినిమాను వేగంగా రూపొందించడంలో జగన్నాథ్ ది అందెవేసిన చేయిగా చెప్పుకుంటారు. అందుకే సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలను రూపొందించడంలో సిద్ధహస్తుడయిన వినాయక్ ను కాదని జగన్నాథ్ కు ఈ పనిని అప్పజెపుతున్నట్టు మరో పుకారు. మరి సామాజిక నేపథ్య కథతో సినిమాను రూపొందించిన నేపథ్యం పూరికి లేదు. ఈ కోణంలో ఆలోచించారో లేదో మరి.


Click it and Unblock the Notifications











