పూరి,నితిన్ కాంబినేషన్ ఖరారు..టైటిల్ ఏమిటంటే
హైదరాబాద్: పూరి జగన్నాథ్, నితిన్ కాంబినేషన్ లో చిత్రం ఖరారైంది. ఈ చిత్రం వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ నిర్మించనున్నారు. కొరియర్ బోయ్ కళ్యాణ్ తర్వాత ఈ చిత్రం పట్టాలు ఎక్కుతుంది. ఈ చిత్రం టైటిల్ హార్ట్ ఎటాక్. ఆగస్టులో ఈ చిత్రం ఓపినింగ్ జరగనుందని తెలుస్తోంది.
గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం ఘన విజయంతో నితిన్ కు వరస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.


Click it and Unblock the Notifications












