»   » అఫీషియల్ : హీరో గ్రీన్ సిగ్నల్, పూరి కి భారీ ప్రాజెక్టు ఖరారు

అఫీషియల్ : హీరో గ్రీన్ సిగ్నల్, పూరి కి భారీ ప్రాజెక్టు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాధ్ ఎప్పుడూ ఖాళీగా ఉండరు. అలాగే చిన్నా, పెద్దా తేడా లేకుండా హీరోలతో ముందుకు వెళ్లిపోతూంటారు. అంతేకాదు ఆయనకు బాషా భేదం కూడా లేదు. అదే వర్కవుట్ అవుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయనకు హిందీలో ఓ భారీ ప్రాజెక్టు సెట్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఖరారు చేసి చెప్తున్నారు.

పూరి జగన్నాధ్ మాట్లాడుతూ... "అవును, నేను సంజయ్ దత్ తో ఓ హిందీ చిత్రం చేయబోతున్నాను, రోగ్ చిత్రం అనంతరం ఈ సినిమా ఉంటుంది. సంజయ్ దత్ నా స్క్రిప్టుని వినిపించాను, ఆయన చాలా ఇష్టపడ్డారు ." అని అన్నారు.

Puri directs Sanjay Dutt

ప్రస్తుతం పూరి జగన్నాధ్...రోగ్ చిత్రం బిజిలో ఉన్నారు. మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ మ‌న‌వడు, క‌ర్నాట‌క మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ గౌడ హీరోగా క‌న్నడ ప‌రిశ్రమ‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. నిఖిల్‌ను వెండితెరపై ప‌రిచ‌యం చేసేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ని ఎంచుకున్నారు. ఆ చిత్రానికి 'రోగ్' అనే టైటిల్‌ని నిర్ణయించారు.

గతంలో కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్‌ను 'అప్పు' చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. అదే సినిమాని రవితేజతో 'ఇడియట్'గా టాలీవుడ్‌లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో 'లోఫర్' తెరకెక్కించిన తర్వాత పూరి ఈ 'రోగ్' పనిలో పడ్డారు.

English summary
Director Puri Jagannadh is going to team up with Bollywood actor Sanjay Dutt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu