జూ ఎన్టీఆర్‌ను పూరి జగన్నాథ్ మోసం చేశాడా?
బిజినెస్ మేన్ రికార్డు స్థాయి హిట్ తో మంచి జోష్ మీద ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పూరి ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఓ విషయం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ తో సినిమా తీద్దామని పూరి భావిస్తున్నప్పటికీ పవన్ డేట్స్ అడ్జెట్ కాక పోవడంతో ఇంత కాలం ఆగాల్సి వచ్చిందని. తాజాగా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లనే ట్విట్టర్ ద్వారా బయటకు వెల్లడించాడని అంటున్నారు.
ఇంత ముందు రవితేజతో ఇడియట్-2 సినిమా తీస్తానని ప్రకటించిన పూరి, ఆ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు కమిట్ అయ్యాడట. అయితే జూనియర్ తో సినిమా విషయం పూరి అధికారికంగా బయట పెట్టలేదు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కావాలనే ఈ విషయాన్ని మరుగున పెట్టాడని అంటున్నారు.
జూ ఎన్టీఆర్‌తో సినిమా తీస్తానని మాట ఇచ్చి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం....మాట తప్పుతారా? ఇలా చేయడం మోసం చేయడం కాదా? అని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి-జూనియర్ సినిమా గురించి అధికారిక సమాచారం లేక పోవడంతో ఈ మోసం వ్యవహారంలో నిజం ఎంతో అంతు పట్టడం లేదు. ఏది ఏమైతేనేం పూరి సినిమా చేస్తానని ప్రకటించినప్పటి నుంచి పవన్ అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











