పూరీ 'ఏక్‌ నిరంజన్‌' పైరసీ పై యుద్దం

By Srikanya

ప్రభాస్‌, కంగనా రనౌత్‌ నాయకా నాయికలుగా పూరి జగన్నాథ్‌ దర్శత్వంలో ఆదిత్యారామ్‌ నిర్మించిన 'ఏక్‌ నిరంజన్‌" చిత్రం ఇటీవలె విడుదలైంది. అయితే ఈ చిత్రంకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పైరసీ మార్కెట్ లో వీటిని అమ్మకానికి పెడుతున్నారు. దాంతో తమ ఏక్ నిరంజన్ చిత్రం పైరసీ చేస్తున్న వారిపై ఆదిత్యారామ్‌ మూవీస్‌ అధినేత ఆదిత్యారామ్‌ యుధ్ధం ప్రకటించారు. పైరసీని పూర్తి స్ధాయిలో నిరోధించటానికి రాష్ట్ర వ్యాప్తంగా క్లూస్‌ టీమ్‌ ఏర్పాటు చేసారు. ఈ సినిమా పైరసీ సిడిలు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో క్లూస్‌ టీమ్‌ సాంబశివరావు ఆధ్వర్యంలో సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఎర్రగడ్డ మార్కెట్‌లో రెండు మొబైల్‌ షాప్‌లపై యస్‌.ఐ.యాదయ్య నేతృత్వంలో దాడి చేసి పైరసీ సిడిలు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆదిత్యారామ్‌ మాట్లాడుతూ "సనత్‌నగర్‌లో పైరసీ సిడిలు అమ్యుతున్నారన్న సమాచారం మా క్లూస్‌ టీమ్‌కు అందడంతో ఆదివారం పోలీసుల సహకారంతో సనత్‌నగర్‌లో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వరంగల్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఒక సిడి షాప్‌లో కూడా పైరసీ సిడిలను పట్టుకోవడం జరిగింది. కడప పట్టణంలో కూడా పైరసీ సిడిలు అమ్ముతున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాం.

అవనిగడ్డ మండలం, మోపిదేవిలో ఈ పైరసీ సిడిలు తయారవుతున్నాయన్న సమాచారంతో అక్కడ కూడా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలా రాష్టవ్య్రాప్తంగా మా క్లూస్‌ టీమ్‌ పైరసీ సిడిలు అమ్ముతున్న వారిని పడ్బందీ పధకంతో అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తున్నాం. పైరసీ సిడిలు అమ్ముతున్న సమాచారం తెలిసినవారెవరైనా మాకు తెలియజేసిన పక్షంలో వారికి విలువైన బహుమతులు అందించనున్నాం" అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X